Ranabaali: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న మూవీ `రణబాలి`. దీన్నుంచి మొదటి పాట ఏందయ్య సామీ విడుదలైంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `రణబాలి`. `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై `రణబాలి` సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు(మంగళవారం) ఈ చిత్రం నుంచి 'ఏందయ్య సామీ..' ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ..ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.
24
ఆకట్టుకుంటున్న ఏందయ్య సామీ లిరికల్ సాంగ్
`రణబాలి`లో విజయ్, రష్మిక పెళ్లి వేడుక సందర్భంగా 'ఏందయ్య సామీ..' పాట చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో 'ఏందయ్య సామీ..' పాటలో అందంగా రూపొందించారు. ఈ పాటను అజయ్ అతుల్ మెలొడియస్ గా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, శ్వేతా మోహన్, అజయ్ గోగవలే మధురంగా పాడారు. 'ఏందయ్య సామీ..' పాట ఎలా ఉందో చూస్తే - 'ఏందయ్యా సామీ ఇట్ట గాస్తాందీ వెన్నెల, ఊపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే జాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా...' అంటూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సాగుతుందీ పాట.
34
రొమాన్స్ లో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ, రష్మిక
ఈ పాటలో రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య రొమాన్స్ అదిరిపోయేలా ఉంది. ఇంటెన్సిటి, కెమిస్ట్రీ బాగా పండింది. ఇద్దరూ లీనమై ఒదిగిపోయి చేశారు. అదే సమయంలో పీరియడ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ లుక్ అప్పటి కాలానికి తగ్గట్టుగానే ఉండగా, రష్మిక లుక్ మాత్రం అలా కనిపించడం లేదు. అదే సమయంలో పాట స్లోగా సాగుతుంది. కానీ అందులోని పదాలు మాత్రం బాగున్నాయి. పదాల్లోని డెప్త్ అదిరిపోయింది. చాలా మీనింగ్‌తో కూడిన పాట కావడం విశేషం. రామజోగయ్య శాస్త్రి పాటకి ప్రాణంపెట్టి రాశారనిపిస్తుంది. అలాగే రాయలసీమ యాసలోనూ శ్వేతా మోహన్, అజయ్ గోగవలే అంతే బాగా పాడారు.
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా `రణబాలి` సినిమా రూపొందుతోంది. అప్పట్లో బ్రిటీష్ వారు మన సంపదని దోచుకుపోయారు. దీంతో ఆకలితో అలమటించి మన భారతీయులు లక్షల్లో చనిపోయారు. ఈ క్రమంలో బ్రిటీష్ వారిపై మన రణబాలి చేసిన తిరుగుబాటే ఈ సినిమా. ఇది పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది.