Rajiv Kanakala: టాలీవుడ్ లోని సీనియర్ నటులలో రాజీవ్ కనకాల ఒకరు. కానీ ఆయన చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువ. దానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ పనిగట్టుకుని రాజీవ్ కు చెప్పిన సలహా ఏంటి? బన్నీ మాటలను లెక్క చేయకుండా రాజీవ్ ఎలా నష్టపోయాడంటే?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నారు.. కానీ రాజీవ్ కనకాల మాత్రం చాలా డిఫరెంట్. ఎన్నో సీరియల్స్, సినిమాలు చేసిన స్టార్ నటుడు. రాజమౌళి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ను కూడా డిమాండ్ చేసి క్యారెక్టర్స్ వేయిచుకునే పలుకుబడి ఉన్న నటుడు. కానీ ఎవరిని క్యారెక్టర్ ఇవ్వమని అడగడు. వచ్చిన ఏ పాత్ర అయినా.. తన బెస్ట్ పెర్ఫామెన్స్ తో నడిపిస్తుంటాడు. టాలీవుడ్ లోఇలాంటి నటులు చాలా అరుదనే చెప్పాలి. అయితే రాజీవ్ కనకాలను బాగా గమనించిన స్టార్ హీరో అల్లు అర్జున్ ఆయన్ను పిలిచి ఓ మాట చెప్పాడట.
24
రాజీవ్ కనకాల నటన చూసి షాక్ అయిన బన్నీ..
రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తనకున్న అనుబంధం, ఆయన తనకు ఇచ్చిన ఒక ముఖ్యమైన సలహా గురించి వెల్లడించారు. బన్నీతో కలిసి సరైనోడు సినిమాలో నటించాడు రాజీవ్ కనకాల. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' సినిమా షూటింగ్ సమయంలో రాజీవ్ కనకాల అల్లు అర్జున్ కలిసి చాలా రోజులు ట్రావెల్ చేశారు. ఆ సినిమాలో కోర్టు సీన్ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ఆ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తయ్యాక, అల్లు అర్జున్ రాజీవ్ కనకాలను ప్రత్యేకంగా పిలిపించి.. "సార్, తెరపై ఎంతమంది నటులు ఉన్నా మీరు నటిస్తున్నప్పుడు అందరి దృష్టి మీ పైనే ఉంటుంది, మీరు అంత అద్భుతమైన నటుడు" అని ప్రశంసించారు.
34
రాజీవ్ కనకాలకు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా
అంతటి అద్భుతమైన నటన ఉన్నప్పటికీ మీరు చాలా తక్కువ సినిమాలు చేశారు. అవకాశాల కోసం ఎవరినీ ఎందుకు అడగరని రాజీవ్ కనకాలను అల్లు అర్జున్ ప్రశ్నించారు. "మీలో గొప్ప నటుడు ఉన్నాడు సార్.. అవకాశాలు అడిగితే తప్పేముంది? అడగాలి సార్" అని చెప్పారు. అంతేకాకుండా, "మనమిద్దరం కలిసి సినిమాలు చేద్దాం.. ప్రొఫెషనల్‌గా మంచి ప్రాజెక్టులు ఉంటే అడగండి" అని సూచించారు. అల్లు అర్జున్ అంతటి స్టార్ హీరో కూడా ఎంతో వినయంతో, మర్యాదగా తనకు మంచి సలహా ఇచ్చారని రాజీవ్ కనకాల గుర్తు చేసుకున్నారు. అయితే, తన స్వభావం వల్ల , మొహమాటం వల్ల అల్లు అర్జున్ చెప్పిన ఆ మాటను తాను ఆచరణలో పెట్టలేకపోయానని, ఎవరినీ అవకాశాలు అడగలేకపోయానని రాజీవ్ కనకాల ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద పెద్ద హీరోలు కూడా దర్శకులతో ప్రొఫెషనల్‌గా ఎలా మాట్లాడతారో రాజీవ్ కనకాల వివరించారు. స్టార్ హీరోలు సైతం దర్శకులకు ఫోన్ చేసి, "ఏదైనా మంచి కథ లేదా ఐడియా ఉంటే చెప్పండి, కలిసి చేద్దాం" అని చాలా ఫ్రెండ్లీగా అడుగుతారని రాజీవ్ కనకాల తెలిపారు. అయితే రాజీవ్ కనకాల అలా దర్శకులను సినిమాల గురించి అడగక.. చాలా క్యారెక్టర్స్ ను కోల్పోయారు అని తెలుస్తోంది. తనను వెతుక్కుంటూ వచ్చిన క్యారెక్టర్స్ ను మాత్రమే ఆయన చేసుకుంటూ వచ్చారు. అల్లు అర్జున్ చెప్పినప్పుడైనా... ఆ విధంగా ప్రయత్నం చేసుంటే.. చాలా సినిమాల్లో బన్నీతో కలిసి రాజీవ్ కనిపించేవారేమో.