తెలుగువారిపై నటి కస్తూరి అవమానకర కామెంట్స్, ఇంతకీ ఆమె ఏమన్నారు?

First Published | Nov 5, 2024, 7:27 AM IST

నటి కస్తూరి తెలుగువారిని ఉద్దేశిస్తూ అవమానకర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆమెపై తెలుగువారు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏమన్నారో చూద్దాం.. 
 


నటి కస్తూరి సంచలన కామెంట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఆమె తెలుగువారిని కించపరుస్తూ మాట్లాడారు. కస్తూరి ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. తమిళనాడులో జరిగిన ఓ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 
 

కస్తూరి మాట్లాడుతూ.. 400 ఏళ్ల క్రితం తెలుగు వారు తమిళనాడుకు వలస వచ్చారు. మన రాజుల అంతఃపురాల్లో సేవకులుగా ఉండేవారని ఆమె అన్నారు. కస్తూరి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కస్తూరి తెలుగువారిని తక్కువ చేసి మాట్లాడారని కొందరు ఫైర్ అవుతున్నారు. ఆమె తెలుగువారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కస్తూరి తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం విశేషం. 

నాకు తమిళనాడు పుట్టినిల్లు అయితే తెలుగు గడ్డ మెట్టినిల్లు లాంటిది. నేను తెలుగువారిని అవమానించలేదు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు. ప్రత్యర్థి పొలిటికల్ పార్టీలు నన్ను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నాయని ఆమె అన్నారు. తెలుగువారు మాత్రం ఆమె చేసిన కామెంట్స్ కి హర్ట్ అయ్యారు. కస్తూరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Latest Videos



గతంలో క్యాస్టింగ్ కౌచ్ పై కూడా కస్తూరి కీలక కామెంట్స్ చేసింది. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్డం తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని ఒప్పుకోరు. అదృష్టం కొద్ది మాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు అంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే. 

ఆమె మాట్లాడుతూ... క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. గతంలో నేను వీటి గురించి మాట్లాడాను కూడాను. అందుకు ఒప్పుకోలేదని సినిమాల్లో నుండి తీసేశారు. ఎపిసోడ్స్ లేపేశారు. తెలుగులో అలాంటి అనుభవం లేదు. 
 

తమిళంలో చూశాను. మలయాళంలో అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పటికి నాకు పెళ్లైంది. ఎలాగొలా బయటపడ్డాను. మలయాళంలో అది నా కమ్ బ్యాక్ మూవీ. అది ఒక పెద్ద ప్రాజెక్ట్. దానికి ఒప్పుకోలేదని తీసేశారు. ఇప్పుడు మలయాళ పరిశ్రమ బాగుంది. అన్నిరంగాల్లో ఈ తరహా అనుభవాలు అమ్మాయిలకు ఎదురవుతున్నాయి. అంతెందుకు ఒక బిల్డింగ్ కడుతుంటే... మేస్త్రికి కూలీకి మధ్య ఎఫైర్స్ ఉంటాయి. ప్రతిచోటా లైంగిక వేధింపులు తప్పవు. అయితే అందరూ అలాంటి వాళ్ళు కాదు. 

లంచం తీసుకునేవాళ్ళు ఉంటారు... తీసుకోని వాళ్ళు ఉంటారు. చిత్ర పరిశ్రమలో కూడా రెండు రకాల మనుషులు ఉంటారు. నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అలా అని నేను పరిశ్రమను వదిలి వెళ్లిపోలేదు కదా. 80 సినిమాలు చేశాను. అందరూ చెడ్డవారు అయితే నేను చేయగలిగేదానిని కాదు కదా. 

ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయి. చెడు మంచి అన్ని చోట్లా ఉంటుంది. అందువలన చిత్ర పరిశ్రమను తప్పుబట్టడానికి వీల్లేదు. మనకు ఎదురైన అనుభవాలను ఎలా ఫేస్ చేశాం అనేదే ముఖ్యం... అని కస్తూరి అన్నారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  


తెలుగులో కస్తూరి పలు చిత్రాల్లో నటించింది. గ్యాంగ్ వార్, నిప్పురవ్వ, అన్నమయ్య వంటి చిత్రాల్లో ఆమె నటించారు. దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన నిప్పు రవ్వ భారీ హిట్ కొట్టింది. కస్తూరి హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ఆమె క్యారెక్టర్ రోల్స్ కి పరిమితం అయ్యింది. తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లీడ్ రోల్ చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్లో నటించింది. 

click me!