రమ్యకృష్ణ సినిమాల్లోకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఇంతటి క్రేజీగా ప్రపంచంలో ఎవరూ ఉండరేమో

Published : Oct 27, 2025, 09:29 AM IST

రమ్యకృష్ణ ఇప్పటికీ స్టార్‌ గా రాణిిస్తోంది. ఇప్పటికీ గ్లామర్ పరంగా ఆమె క్రేజ్‌ తగ్గలేదంటే అతిశయోక్తి లేదు. అయితే తాను సినిమాల్లోకి రావడం వెనుక అసలు కారణం బయటపెట్టింది రమ్యకృష్ణ. 

PREV
14
స్ట్రాంగ్‌ లేడీ రోల్స్ కి బెస్ట్ ఆప్షన్‌ రమ్యకృష్ణ

వెర్సటైల్‌ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలతో దుమ్ములేపింది. కమర్షియల్‌ చిత్రాలతో ఆద్యంతం ఆకట్టుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. హీరోయిన్‌ పాత్రలే కాదు, నెగటివ్‌ రోల్స్ తోనూ అదరగొట్టింది. ఆ తర్వాత బలమైన కీలక పాత్రలు చేసి మెప్పించింది. `బాహుబలి`లో ఆమె నటించిన శివగామి పాత్ర ఎంతటి స్ట్రాంగ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తను కూడా ఆ పాత్రలో రెచ్చిపోయి నటించింది. కొన్ని సీన్లలో గూస్‌ బంమ్స్ తెప్పించింది. లేడీ క్యారెక్టర్స్ పరంగా స్ట్రాంగ్‌ రోల్స్ చేసే విషయంలో ఇప్పుడున్న వారిలో రమ్యకృష్ణని మించిన వారు లేరంటే అతిశయోక్తి లేదు.

24
రమ్యకృష్ణ సినిమాల్లోకి రావడం వెనుక స్టోరీ

అయితే రమ్యకృష్ణకి ఈ ఇమేజ్‌ రావడం వెనుక, ఇంతటి తిరుగులేని స్టార్‌గా ఎదగడం వెనుక చాలా కష్టం ఉంది. చాలా అవమానాలున్నాయి. లెక్కలేనన్ని పరాజయాలున్నాయి. రమ్యకృష్ణ తెలుగులో నటించిన తొలి చిత్రం `భలే మిత్రులు`. ఇందులో సెకండ్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా ఆడలేదు. ఆ తర్వాత మూడేళ్ల వరకు ఒక్క హిట్‌ కూడా లేదు. ఎన్ని ఫ్లాప్‌ అయ్యాయో లెక్క కూడా లేదు. వరుసగా పోతూనే ఉన్నాయి. సక్సెస్‌ అనేది దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. చాలా లో అయిపోయిందట. ఒక్క హిట్‌ కోసం ఎంతో తపించిందట. అయితే అందుకు ఓ కారణం చెప్పింది. తానేదో గొప్ప పేరు తెచ్చుకోవాలని, స్టార్‌ అయిపోవాలని అనుకోలేదట. దానికి అసలు కారణం బయటపెట్టింది రమ్యకృష్ణ. జగపతిబాబు హోస్ట్‌ గా రన్‌ అవుతున్న `జయమ్ము నిశ్చయమ్మురా` షోలో ఈ విషయాన్ని రమ్యకృష్ణ తెలిపింది.

34
చదువు, ఎగ్జామ్స్ భయంతో సినిమాల్లోకి రమ్యకృష్ణ

రమ్యకృష్ణకి స్టడీస్‌ అంటే నచ్చదు. ఎగ్జామ్స్ అంటే మహా భయం. వాటిని తప్పించుకునేందుకు సినిమాల్లోకి వచ్చినట్టు తెలిపింది రమ్యకృష్ణ. 1984లో ఫస్ట్ మూవీ విడుదలైతే, ఆ తర్వాత మూడేళ్లు వరుసగా సినిమాలు పరాజయం అవుతున్నాయి. ఒక్క హిట్‌ అయితే బాగుండూ అనిపించేది. సక్సెస్‌ లేకపోవడంతో ఇంట్లో పేరెంట్స్ తీసుకెళ్లి మళ్లీ స్టడీస్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. దీంతో నో నో అని వాదిస్తూ వచ్చిందట. తాను మళ్లీ ఆ స్కూల్‌కి వెళ్లలేను, ఆ ఎగ్జామ్స్ రాయలేను అని చెప్పింది. ఆ సమయంలోనే ఓ జ్యోతిష్యుడికి చూపిస్తే సినిమాల్లో ఈమె గొప్ప స్థాయికి ఎదుగుతుందని చెప్పాడట. ఆ మాటతో రమ్యకృష్ణకి కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. తానేదో గొప్ప హీరోయిన్‌ అయిపోతాననేది తన ఫీలింగ్ కాదు, చదువు, ఎగ్జామ్స్ నుంచి పర్మినెంట్‌గా తప్పించుకోవచ్చు అనేది.

44
`అల్లుడుగారు`తో ఫస్ట్ బ్రేక్‌

అలాంటి సమయంలో విశ్వనాథ్‌ రూపొందించిన `సూత్రధారులు` మూవీలో ఆఫర్‌ వచ్చింది. అది తనకు అసలైన లెర్నింగ్‌ ఎక్స్ పీరియెన్స్ అని, డాన్సులు చేయడం, నటించడం, చాలా రకాలుగా కెరీర్‌కి ఉపయోగపడిందని, ఈ సినిమాతోనే తనకు ఇండస్ట్రీలో మొదటి స్టెప్‌ పడిందన్నారు రమ్యకృష్ణ. `సూత్రధారులు` సినిమా చూసే కె రాఘవేంద్రరావు  తనని `అల్లుడుగారు` సినిమాకి ఎంపిక చేశారట. `అల్లుడుగారు` మూవీతో రమ్యకృష్ణ లైఫ్‌ మారిపోయింది. హీరోయిన్‌గా బ్రేక్‌ అందుకుంది. వరుసగా భారీ ఆఫర్లు వచ్చాయి. వరుసగా విజయాలు సాధించింది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ప్రారంభంలో చాలా పెద్ద సినిమాలకు తనని ఎంపిక చేసి తొలగించారట. అప్పట్లో `అల్లరి మొగుడు` సినిమా వంద రోజుల వేడుకలో రమ్యకృష్ణ ఈ విషయాన్ని చెబుతూ ఎమోషనల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రావడానికి ఆమెకి ఏడేళ్లు పట్టిందటని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది రమ్యకృష్ణ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories