కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యో, పారులకు షాక్ ఇచ్చిన శివన్నారాయణ- శౌర్యకు మాటిచ్చిన కార్తీక్

Published : Oct 27, 2025, 07:50 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 27వ తేదీ)లో సుమిత్ర గురించి వెతకాల్సిన పనిలేదంటాడు శివన్నారాయణ. మమ్మీ ఎక్కడుందో తాత, బావలకు తెలుసు అంటుంది జ్యోత్స్న. ఆలోచనల్లో మునిగిపోతాడు దశరథ. నాకు చెల్లి కావాలి అంటుంది శౌర్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో అత్త గురించి ఇంట్లో చెప్పకు తాత అంటాడు కార్తీక్. ఈ రోజు నువ్వు కొత్త తాతను చూస్తావు అంటాడు శివన్నారాయణ సుమిత్ర ఫోటో చూస్తూ బాధపడుతుంటాడు దశరథ. ఫోటో చూస్తే సుమిత్ర రాదు దశరథ. వెతికితే వస్తుంది అంటుంది పారు. నువ్వు డాడీని ఏం అనకు గ్రానీ. మమ్మీని నేను వెతికి తీసుకొస్తాను అంటుంది జ్యోత్స్న. సుమిత్రను ఎవ్వరూ వెతకాల్సిన పనిలేదు అంటాడు శివన్నారాయణ. ఆ మాటకు అంతా షాక్ అవుతారు. 

26
వీళ్లిద్దరికీ మమ్మీ ఎక్కడుందో తెలుసు

ఒక మాట అంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలా? నేను ఒక మాట అంటే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? అని దశరథను అడుగుతాడు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తా నాన్న అంటాడు దశరథ. మరి తను మాత్రం మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది. మనల్ని వద్దనుకొని వెళ్లిన మనిషి కోసం మనమెందుకు బాధపడాలి అంటాడు శివన్నారాయణ. తను వెళ్లిపోవడానికి కారణం నేనే కదా నాన్న అంటాడు దశరథ. 

అవును భార్యా భర్తలు అన్నాక ఒక మాట అనుకోరా.. అంత మాత్రానికే వెళ్లిపోవాలా? అంటాడు శివన్నారాయణ. తను ఉన్నప్పుడు తనతో సరిగ్గా మాట్లాడావా? పోని తను ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఉంటే క్షమించే వాడివా? అని అడుగుతాడు. రేపు మీ పెళ్లి రోజట కదా.. సుమిత్ర లేదు కాబట్టి అది కూడా జరుపుకోవాల్సిన అవసరం లేదు. తను వచ్చినప్పుడే వస్తుంది లే అంటూ లోపలికి వెళ్లిపోతాడు శివన్నారాయణ. 

నిన్నటి దాకా కోడలు లేదని మంచం పట్టిన మనిషి.. సడెన్ గా ఇలా మారిపోయాడు ఏంటి అని జ్యోతో అంటుంది పారు. డౌట్ లేదు గ్రానీ. తాత, బావలకు మమ్మీ ఎక్కుడుందో తెలిసిపోయింది అంటుంది జ్యోత్స్న. కానీ ఎక్కడుంది. ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

36
కాశీకి క్లాస్ ఇచ్చిన శ్రీధర్

మరోవైపు ఇంటికి వచ్చిన కాశీకి వేడి వేడి పాలు తాగమని ఇస్తాడు శ్రీధర్. ఆఫీస్ లో పని బాగా జరిగిందా అని అడుగుతాడు. బాగానే ఉంది మామయ్య గారు అని చెప్తుండగానే.. తను తీసిన ఫోటోను కాశీకి చూపిస్తాడు. అది చూసి షాక్ అవుతాడు కాశీ. ఆఫీసులో మీటింగ్ అని చెప్పి నీ ఫ్రెండ్ తో రోడ్డుపై టైంపాస్ చేస్తున్నావు. పెద్ద జాబ్ అని అబద్ధం చెప్పావు. ఏంటి ఇది అని గట్టిగా అడుగుతాడు. 

ఇంతలో అక్కడికి వచ్చిన స్వప్న.. ఆఫీస్ లో అలిసిపోయి ఉంటావు.. రెస్ట్ తీసుకో కాశీ అంటుంది. స్వప్న నీకో విషయం చెప్పాలి అంటాడు శ్రీధర్. ఏంటి నాన్న అని అడుగుతుంది స్వప్న. పక్కనుంచి చెప్పొద్దు అని దండం పెడతాడు కాశీ. తర్వాత చెప్తాలే అంటాడు శ్రీధర్.

46
అన్నింటికి కారణం నువ్వే

నీ మాటల ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు తాత అంటాడు కార్తీక్. దశరథకు సుమిత్రపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమను బయటపెట్టే ప్రయత్నం చేశాను అంటాడు శివన్నారాయణ. సుమిత్రను తను ఎంత బాధపెట్టాడో.. గతంలో తను ఎలా ఉండేవాడో ఆలోచిస్తూ ఉంటాడు అది కూడా మంచికే అంటాడు శివన్నారాయణ. నిజం చెప్పాలంటే వీటన్నింటికీ కారణం నువ్వే తాత అంటాడు కార్తీక్. 

మా అమ్మకు మా నాన్న దూరం అయినప్పుడు నేనున్నాను అనే ధైర్యం నువ్వు ఇచ్చావా? మా అమ్మకు పుట్టిళ్లు దూరమై ఏడుస్తున్నప్పుడు తన చెల్లెలి కోసం మామయ్య బాధపడ్డాడు. ఏలాగైనా ఈ కుటుంబానికి దగ్గర చేయాలి అనుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి అనుకున్నాడు. అత్త అనవసరమైన అపోహలతో ఏదో చేసింది. జ్యోత్స్న దాన్ని మరింత పెద్దది చేసి అత్త, మామయ్యల మధ్య దూరం పెంచింది అంటాడు కార్తీక్. జరిగింది ఏదో జరిగిపోయింది కానీ వాళ్లిద్దరినీ ఎలా కలపాలి అని అడుగుతాడు కార్తీక్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రేపు చెప్తాను అంటాడు శివన్నారాయణ.

56
చెల్లె కావాలా? లేక తమ్ముడా?

మరోవైపు ఈ బొమ్మకు ఏదో ఒక మంచి పేరు పెట్టమ్మ అని అడుగుతుంది శౌర్య. ఏంటి రౌడీ అంటూ లోపలికి వస్తాడు కార్తీక్. చూడు నాన్న. ఈ బొమ్మను చెల్లి అనుకోమంది. మంచి పేరు చెప్పమంటే చెప్పట్లేదు అంటుంది శౌర్య. నీకు చెల్లి కావాలా?తమ్ముడు కావాలా అని అడుగుతాడు కార్తీక్. నాకు చెల్లె కావాలి నాన్న. తమ్ముడు మాట వినడు. మా ఫ్రెండ్ వాళ్ల ఇంట్లో అలాగే జరుగుతోంది అంటుంది శౌర్య. సరే అయితే నీకు చెల్లినే ఇస్తాము అంటాడు కార్తీక్. ఎప్పుడు అని అడుగుతుంది శౌర్య. ఇంకో సంవత్సరానికి అని చెప్తాడు. సంతోషంగా బయటకు వెళ్తుంది శౌర్య.

66
సిగ్గుతో బయటకు వెళ్లిన దీప

అక్కడి పరిస్థితి ఎలా ఉంది బావ అని అడుగుతుంది దీప. రేపు అత్తయ్య వాళ్ల పెళ్లిరోజు కదా.. వారిని కలపడానికి తాత ఒక ప్లాన్ చెప్తా అన్నాడని చెప్తాడు కార్తీక్. రేపు మా అమ్మనాన్నల పెళ్లి రోజా.. అని ఎగ్జైట్ అవుతుంది దీప. ఎలాగైనా అమ్మానాన్నలను కలపాలి. పెళ్లిరోజు బాగా చేయాలి అంటుంది దీప. ఈ ఆనందంతో నాకు నిద్రపట్టదు బావ అంటుంది దీప. నిద్ర రాకపోవడం కూడా మంచిదేలే.. నువ్వు పాలగ్లాస్ తీసుకొని రా.. మనం తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అంటాడు కార్తీక్. సిగ్గుపడుతూ బయటకు వెళ్తుంది దీప. రేపు తాత ఏం ప్లాన్ చెప్తాడో అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories