సినిమాకి సెలక్ట్ చేసి తీసేశారు.. ఆ టైమ్‌లో రమ్యకృష్ణకి లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా? అందుకే కన్నీళ్లు

Published : Sep 13, 2025, 05:09 PM IST

రమ్యకృష్ణ కెరీర్‌ బిగినింగ్‌లో చాలా స్ట్రగుల్‌ అయ్యింది. చాలా మంది మేకర్స్ సెలక్ట్ చేసి తీసేశారు. అలాంటి టైమ్‌లో రమ్యకృష్ణకి లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా?  

PREV
15
రమ్యకృష్ణ స్ట్రగుల్స్ నుంచి స్టార్‌ హీరోయిన్‌గా

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన రమ్యకృష్ణ ఇప్పుడు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. బలమైన పాత్రలు మాత్రమే చేస్తూ అలరిస్తుంది. ఒకప్పుడు గ్లామర్‌ రోల్స్ చేసిన రమ్యకృష్ణ `నరసింహ` తర్వాత  కెరీర్‌ మరో టర్న్ తీసుకుంది. స్ట్రాంగ్‌ ఉమెన్ రోల్స్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో `బాహుబలి` మూవీ ఆమె కెరీర్‌ని మరో మలుపు తిప్పింది. బలమైన మహిళా ప్రధాన పాత్రలకు ఆమె కేరాఫ్‌గా మార్చేసింది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో బ్రేక్‌ ఇచ్చిందని చెప్పొచ్చు.

25
రమ్యకృష్ణని బుక్‌ చేసుకుని రిజెక్ట్ చేసేవారు

అయితే కెరీర్‌ ప్రారంభంలో మాత్రం రమ్యకృష్ణ స్ట్రగుల్‌ అయ్యింది. చిన్న చిన్న పాత్రలు, చిన్న సినిమాలు చేస్తూ ఎదిగింది. మొదట తమిళంలో సినిమాలు చేసింది. 1984లో `కాంచు కాగడ` చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆమెకి సక్సెస్‌ రావడానికి చాలా టైమ్‌ పట్టింది. పైగా ఆ సమయంలో ఆఫర్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి. చాలా మంది నిర్మాతలు తనని హీరోయిన్‌గా బుక్‌ చేసుకుని రిజెక్ట్ చేసేవాళ్లట. మరో హీరోయిన్‌ని తీసుకునేవాళ్లట. అలా చాలా సినిమాలు కోల్పోయిందట.

35
రమ్యకృష్ణకి లైఫ్‌ ఇచ్చిన రాఘవేంద్రరావు

ఇలా పలు సినిమా ఆఫర్లు కొల్పోయిన క్రమంలో రమ్యకృష్ణకి లైఫ్‌ ఇచ్చింది దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు. ఓ సందర్భంలో రమ్యకృష్ణ  ఆయన ముందు తన ఆవేదన వ్యక్తం చేసిందట. దీంతో ఆమెతో ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది, ఎలా చూపిస్తే బాగుంటుందనే దానిపై వర్క్ చేశారు. అందులో భాగంగా ఆమె నటించిన సినిమాలు చూసినప్పుడు ప్రారంభంలో చేసిన ఓ మూవీలో రమ్యకృష్ణ నటన, ఎక్స్ ప్రెషన్స్ పట్టుకున్నాడట. ఆమెని ఎలా చూపిస్తే బాగుంటుందో దానిపై ఫోకస్‌ పెట్టాడట. అలా 1990లో `అల్లుడుగారు` సినిమాకి ఎంపిక చేశారు రాఘవేంద్రరావు. అందులో రెండో హీరోయిన్‌గానే. అయినా అదిరిపోయే పాత్ర పడింది. మోహన్‌బాబుకి జోడీగా చేసి మెప్పించింది. రమ్యకృష్ణ అందరి చూపుని ఆకర్షించింది.

45
తన బాధని వ్యక్తం చేస్తూ రమ్యకృష్ణ ఆవేదన

ఆ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ రమ్యకృష్ణతో సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. ఆ వెంటనే `అల్లరి మొగుడు` చేశాడు. అది పెద్ద హిట్‌. రమ్యకృష్ణకి తెలుగులో పెద్ద బ్రేక్‌ వచ్చింది. ఈ సినిమా వంద రోజులు ఆడింది. ఆ సందర్భంగా 100రోజుల వేడుక నిర్వహించారు. ఇందులో రమ్యకృష్ణ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యింది. ఈ సక్సెస్‌కి కారణం కె రాఘవేంద్రరావు అని తెలిపింది. తనని చాలా మంది దురదృష్టవంతురాలు అనేవారని, కొందరు నిర్మాతలు సినిమాల్లో ఓకే చేసి, తర్వాత తొలగించారని, చాలా సార్లు జరిగిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది రమ్యకృష్ణ. ఆ టైమ్‌లో రాఘవేంద్రరావు తనని నమ్మి అవకాశం ఇచ్చిన ఇంతటి విజయాన్ని అందించారని రాఘవేంద్రరావుకి థ్యాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగానే ఆమె ఇంకా మాట్లాడాలనుకున్నా, భావోద్వేగాన్ని కంట్రోల్‌ చేసుకోలేక వెళ్లిపోయింది.

55
రాఘవేంద్రరావుకి ఎప్పటికీ రుణపడి ఉంటా

అలా రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన `అల్లుడుగారు`, `అల్లరి మొగుడు` చిత్రాలతో రమ్యకృష్ణ లైఫే మారిపోయింది. ఆ తర్వాత స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇకవెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మొదట్లో తనని రిజెక్ట్ చేసినవాళ్లే ఆ తర్వాత రమ్యకృష్ణ కాల్షీట్ల కోసం క్యూ కట్టడం విశేషం. ఇదంతా తనకు రాఘవేంద్రరావు వల్లే అని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది రమ్యకృష్ణ. సౌందర్యలహరి ప్రోగ్రామ్‌లో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. అక్కడ కూడ భావోద్వేగానికి గురయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories