బ్రహ్మానందం రాజకీయాల్లోకి రాబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్

Published : Sep 13, 2025, 04:44 PM IST

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం రాజకీయాల్లోకి రాబోతున్నారా? సినిమాలు తగ్గించిన ఆయన పొలిటికల్ గా ఎవరిని ఇష్టపడతారు? పొలిటికల్ ఎంట్రీ గురించి హాస్యబ్రహ్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి?

PREV
15
ఆత్మ కథ రాసుకున్న బ్రహ్మానందం

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం చాలా కాలం నుంచి సినిమాలు తగ్గించారు, అడపా దడపా గెస్ట్ రోల్స్ చేసుకుంటున్నారు. మిగిలిన టైమ్ లో తనకు నచ్చిన పని చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆయన పెయింటింగ్ తో పాటు, తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ బుక్ కు 'ME and मैं' అనే పేరును పెట్టారు బ్రహ్మానందం. ఇక రీసెంట్ గా ఈ బుక్ ను ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బ్రహ్మానందం తన జీవితంలోని కీలక ఘట్టాలు, అభిప్రాయాలను పంచుకున్నారు.

25
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం.

ముఖ్యంగా తన రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ వేశారు బ్రహ్మీ. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని స్పష్టంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ "నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే వ్యక్తిని కాదు," అంటూ బ్రహ్మానందం తేల్చిచెప్పారు. తన జీవితం పూర్తిగా చిత్ర పరిశ్రమకే అంకితం చేసినదని, సినిమా రంగమే తన చివరి మజిలీ అని అన్నారు. "నా పదవికి రిటైర్మెంట్ ఇవ్వొచ్చు కానీ, నా పెదవికి రిటైర్మెంట్ ఇవ్వలేను. నేను నవ్విస్తూ ఉంటాను" అని ఆయన మరోసారి తన మార్క్ కామెడీ పండించారు. సభలో నవ్వులు పూయించారు.

35
కెరీర్ లో ఎన్నో కష్టాలుపడిన బ్రహ్మానందం.

బ్రహ్మానందం మాట్లాడుతూ, "నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి, నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాను. ఇప్పటివరకు 1200కి పైగా సినిమాల్లో నటించాను. ఇది నటరాజ స్వామి ఆశీర్వాదం తో పాటు ప్రేక్షకుల అభిమానంతోనే సాధ్యమైంది" అని అన్నారు.

45
మీమ్స్ గురించి బ్రహ్మానందం స్పందన

ఈ సందర్భంగా బ్రహ్మానందం తనపై సోషల్ మీడియాలో వదిలే మీమ్స్ గురించి కూడా మాట్లాడారు. "నన్ను కేవలం హాస్యనటుడిగానే కాకుండా 'మీమ్స్ బాయ్'గా మార్చారు. అయినా ఏ రూపంలోనైనా పదిమందిని నవ్వించడం నా ధ్యేయం" అని తనదైన కామెడీ మార్క్ డైలాగ్స్ తో నవ్వించారు బ్రహ్మానందం. అంతే కాదు పొలిటికల్ గా తను ఆర్శంగా తీసుకునే వ్యక్తి గురించి కూడా ఆయన మాట్లాడారు. కష్టపడితే విజయం తప్పదు అనే విషయానికి వెంకయ్య నాయుడు జీవితమే నిదర్శనమని, తనకు ఆయన నుండి స్ఫూర్తి లభించిందని బ్రహ్మానందం అన్నారు.

55
ఎటువంటి వివాదాలు ఉండవు.

సాధారణంగా సెలబ్రిటీల ఆత్మకథలలో ఏదో ఒక వివాదాస్పద అంశాలు టచ్ చేస్తుంటారు. దాంతో అది వైరల్ అవ్వడంతో పాటు, కాంట్రవర్సీలకు కూడాదారి తీస్తుంటాయి. అయితే ఈ విషయంలో కూడా బ్రహ్మానందం క్లారిటీ ఇచ్చారు. తన ఆత్మకథలో అటువంటి వివాదాలకు తావులేకుండా, కేవలం తన అనుభవాలను, జీవితంలో ఎదురైన సవాళ్లను, విజయాలను మాత్రమే పొందుపరిచానని బ్రహ్మానందం తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories