కాకపోతే కొంచెం గడువు కావాలి,ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి కదా అప్పుడే జెస్సి జీవితం అక్కడ బాగుంటుంది అని అంటాడు.అప్పుడు జెస్సి వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి, సరే నేను మీ మాటలు నమ్మి కొంచెం సమయం గడివిస్తున్నాను అని జెస్సిని లోపలికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత జానకి,రామ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జానకి రామా తో,మీరు నన్ను ఎందుకు నమ్ముతున్నారు రామా గారు? అని అడగగా ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అని మీరు ధైర్యంగా ఉన్నారంటే, మీ మాటల్లో నాకు నమ్మకం ఉన్నది జానకి గారు.