ఆ తర్వాత సీన్లో జానకమ్మ ఆలోచిస్తూ, ఇప్పుడు రాదని ఎలా ఆపాలి, ఇల్లు కూడా చూసుకున్నది అని ఆలోచిస్తూ ఉండగా చిన్మయి ఎక్కడికి వస్తుంది. అప్పుడు జానకమ్మ చిన్మయి తో ,అమ్మ ఒకవేళ నువ్వు అమ్మ లేకపోతే ఏం చేస్తావు అని అడగగా, అమ్మ లేకపోతే నేను ఉండను అని అంటుంది చిన్మయి. అప్పుడు జానకమ్మ మనసులో, చిన్మయి ఎలా ఉంటాదో రాద లేకపోతే అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి,చిన్మయి పడుకుని ఉంటారు.చిన్మయి అర్ధరాత్రి లెగుస్తుంది. ఏమైందమ్మా మంచినీళ్లు కావాలా అని రాధ వెళ్లి మంచినీళ్లు పడుతూ ఉంటుంది.