Janaki Kalaganaledu: అత్త కోసం సొంత అన్నను నిలదీసిన జానకి.. జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ యోగి!

Published : Apr 13, 2022, 11:42 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అనే నేపథ్యంలో కొనసాగుతోంది. పైగా ప్రేక్షకాదరణ భారీస్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Janaki Kalaganaledu: అత్త కోసం సొంత అన్నను నిలదీసిన జానకి.. జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ యోగి!

రామచంద్ర (Ramachandra) తన భాదను వాళ్ళ అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాక సువ్వి సువ్వాలమ్మ పాటను ఇమిటేట్ చేస్తూ జ్ఞానాంబ ను చూస్తూ పాడతాడు. ఇక అలా రామచంద్ర ను చూసి జ్ఞానాంబ (Jnanamba) ఎంతో బాధపడుతుంది. ఇక రామచంద్ర కూడా ఆ సమయంలో ఎంతో ఎమోషనల్ అవుతాడు.
 

26

ఇక గోవింద్ రాజు (Govindaraju) జ్ఞానం నీకు తెలియదా ఇలా తిండి తిప్పలు లేకుండా ఉంటే అక్కడ వాడు ఎలా బాధపడతాడో అని అంటాడు. మరోవైపు రామచంద్ర (Ramachandra) కళ్ళ ముందు మా తల్లిని వెళ్లి అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అని జానకి కి చెప్పుకుంటూ బాధపడతాడు.
 

36

ఆ తర్వాత జ్ఞానాంబ (Jnanamba) నాకు జరిగిన అవమానానికి తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చొని ఉంటాను అని అందరు అనుకుంటున్నారు. కానీ అలా కాదు అని జానకి దంపతులు చూసేలా టిఫిన్ చేస్తుంది. ఇక జానకి దంపతుల దగ్గరకు గోవిందరాజు (Govindaraju) వచ్చి మీ అమ్మ అన్నం తింటే తప్ప నువ్వు తినవు. అందుకే మీ అమ్మ టిఫిన్ చేసింది అని అంటాడు.
 

46

మరోవైపు ఊర్మిళ (Urmila) మీ అర్థంపర్థంలేని ఆవేశంతో మీ చెల్లెలి కాపురం సమస్యలో పడడానికి మీరే కారణం అయ్యారని యోగి (Yogi) ను అంటుంది. అంతేకాకుండా  ఇంత జరిగినప్పటికీ ఆవిడ మాత్రం నాకు సారే పెట్టి నిండు నూరేళ్లు హాయిగా బ్రతకమని దీవించింది అని జ్ఞానాంబ గొప్పతనం గురించి చెబుతుంది.
 

56

ఆ తర్వాత జానకి (Janaki) తన అన్న యోగి (Yogi) ని ఒక చోటకు పిలిచి నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే.. నా కాపురం బాగుండాలని నువ్వు కోరుకుంటే మా అత్తయ్య గారికి క్షమాపణలు చెప్పు అని అంటుంది. అంతేకాకుండా కాళ్ళ మీద కూడా పడాలి అంటుంది. కానీ యోగి అది కుదరదు అన్నట్లుగా మాట్లాడుతాడు.
 

66

ఇక తన చెల్లెలు జీవితం బాగుండాలని యోగి (Yogi) జ్ఞానాంబ (Jnanamba) కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అత్తయ్య అని అడుగుతాడు. కానీ జ్ఞానాంబ ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories