ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించారు. ఆయన సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెల్వరాఘవన్, రెడిన్ కింగ్స్లీ, బ్జోర్న్ సుర్రావ్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకోలు చిత్రంలో సహాయక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ అదిపోయే సంగీతం అందించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.