అప్పుడు జ్ఞానాంబ జెస్సికి సీమంతం చేద్దాం అనుకుంటున్నాను అనడంతో రామచంద్ర,జానకి షాక్ అవుతారు. అప్పుడు ఆ మాటలు విన్న మల్లిగా నేను అనవసరంగా ముందుగానే ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్నాను. ఫంక్షన్ జరిగి ఉంటే నాకు డబ్బులు కూడా వచ్చేవి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి వద్దు అత్తయ్య గారు ఇప్పుడే అని అనగా లేదు జానకి జెస్సికి శ్రీమంతం జరిపిద్దాము అని అంటుంది. రేపే జెస్సిమీ శ్రీమంతం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు జ్ఞానాంబ దంపతులు. ఆ తర్వాత రామచంద్ర బయటికి వెళ్లి జరిగిన విషయాల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.