Bigg Boss Telugu 6
ప్రతి బిగ్ బాస్ సీజన్ కి రెండు మూడు ప్రేమ జంటలు తెరపైకి వస్తాయి. ఒంటరిగా హౌస్లోకి వెళ్లిన అమ్మాయిలు, అబ్బాయిలు జంటలై బయటకు వస్తారు. రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అభిజీత్-హారిక, అఖిల్-మోనాల్ క్రేజీ బిగ్ బాస్ లవర్స్ గా పేరు తెచ్చుకున్నారు.
Bigg Boss Telugu 6
లేటెస్ట్ సీజన్ లో ఈ డోసు కొంచెం తగ్గింది. శ్రీహాన్-శ్రీసత్య సన్నిహితంగా ఉంటున్నప్పటికీ సిరి కారణంగా మేము ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య అఫెక్షన్ అయితే ఉంది. సీజన్ 5లో శ్రీహాన్ లవర్ సిరి ఇలానే ఫ్రెండ్ అంటూ షణ్ముఖ్ తో హద్దులు మీరిన రొమాన్స్ చేసింది. సిరి-షణ్ముఖ్ ఒకరికోసం ఒకరు ఏడవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం.. మళ్ళీ ఒకటైపోవడం... అబ్బో చాలా చేశారు.
Bigg Boss Telugu 6
కాగా బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Telugu 6) లో కూడా ఒక ప్రేమ జంట అవతరించింది. అది ఇనయా అండ్ సూర్య. మనోడు బిగ్ బాస్ మన్మథుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఫస్ట్ ఆరోహిరావుతో హగ్గులు, ముద్దులు కానిచ్చేశాడు. ఆమె ఎలిమినేట్ అయ్యాక ఇనయాను లైన్లో పెట్టాడు. అయితే ఇనయానే ముందుగా తన లవ్ ఎక్స్ప్రెస్ చేసింది. సూర్య నా క్రష్ అని మొహమాటం లేకుండా చెప్పింది.
Bigg Boss Telugu 6
ఇంటి సభ్యులు, ఆడియన్స్ కి వారి రిలేషన్ పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తెలిసిన వ్యవహారమే కదా అని సూర్య-ఇనయా పాలు నీళ్లలా హౌస్లో కలిసిపోయారు. ఒకే మంచం ఒకే కంచం అన్నట్లు పరిస్థితి వచ్చింది. పూర్తిగా ఇన్వాల్వ్ అయిన ఇనయా గేమ్ కూడా పక్కన పెట్టేసింది. దీంతో నాగార్జున క్లాస్ పీకాడు. గేమ్ పూర్తిగా డల్ అయ్యిందని చెప్పడంతో ఇనయా-సూర్య ఒక ఒప్పందానికి వచ్చారు.కొద్దిరోజులు డిస్టెన్స్ మైంటైన్ చేద్దామని డీల్ చేసుకున్నారు.
Bigg Boss Telugu 6
ఈ క్రమంలో సూర్యను ఇనయా(Inaya Sulthana) నామినేట్ కూడా చేసింది. అనూహ్యంగా ఆ వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. దీంతో నమ్మినవాడికి వెన్నుపోటు పొడిచావ్ అంటూ శ్రీహాన్, శ్రీసత్య ఆమెను మాటలతో బాధపెట్టాడు. సూర్య ప్లేటులో తింటూ, కప్పులో తాగుతూ అతని జ్ఞాపకాలతో ఇనయా బ్రతికేసింది.
Bigg Boss Telugu 6
కాగా 14వ వారం ఇనయా ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే ఇనయా తన ప్రియుడు సూర్యను కలిశాడు. సూర్యతో రొమాంటిక్ గా దిగిన ఫోటో ఇనయా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ప్రేమ జంట మరలా కలిశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Bigg Boss Telugu 6
అయితే హౌస్ నుండి బయటకు వచ్చాక సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇనయా నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. అలాగే బుజ్జమ్మ కూడా ఫ్రెండే. నేను పెద్దవాళ్ళు కుదిర్చిన అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. గతంలో అమ్మాయిని ప్రేమిస్తే మోసం చేసిందని సూర్య చెప్పడం కొసమెరుపు.