నా పెళ్లి గురించి మీకెందుకు అంత అత్యుత్సాహం.. శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

Published : Dec 13, 2022, 12:42 PM IST

నెటిజన్లపై మండిపడింది స్టార్ హీరోయిన్ శృతిహాసన్. తన గురించి తన పెళ్ళి గురించి నెటిజన్లకు ఉత్సాహం మరీ పెరిగిపోయిందన్నారు.   

PREV
16
నా పెళ్లి గురించి మీకెందుకు అంత అత్యుత్సాహం.. శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

శృతిహాసన్ కు విసుగొచ్చింది. .. కోపమొచ్చింది.  భరించలేక ఫైర్ అయ్యింది. తన గురించి.. తన జీవితం గురించి.. తన పెళ్ళి గురించి  నాకంటే సోషల్ మీడియా జనాలకే ఉత్సాహం ఎక్కువైపోయింది. నాకు లేనిబాధ మీకెందుకు అని ఫైర్ అయ్యింది కోలీవుడ్ బ్యూటీ. ఇంతకీ ఆమె ఏమన్నదంటే. 
 

26

సెలబ్రిటీల పెళ్లి విషయంలో చాలా మంది ఎందుకు అత్యుత్సాహం చూపిస్తారో అర్ధం కావడంలేదు.  ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నప్పుడు అసలు  పెళ్లి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది.  అంటూ డిఫరెంట్ గా కామెంట్ చేసింది శృతీ హాసన్. ఫైన్ ఆర్ట్స్ కళాకారుడు  శంతను హజారికాతో ఈ బ్యూటీ ప్రేమలో ఉంది. సహజీవనం కూడాచేస్తోందట. 

36

గతంలో ఓ ఫారెనర్ ను ఘాడంగా ప్రేమించింది శృతీహాసన్. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుందంట. కాని మధ్యలోనే వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. కొంత కాలం సింగిల్ గా ఉన్న శృతి హాసన్.. ప్రస్తుతం శంతను తో డేటింగ్ లో ఉంది. ఇక వీరి మధ్య కూడా మనస్పర్థలు వచ్చినట్టు కొన్ని రూమర్స్ బయటకు వినిపిస్తున్నాయి. 
 

46

ప్రస్తుతం ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారు. అయితే తాను  ఎక్కడకు వెళ్లినా.. అటు తిప్పి ఇటు తిప్పి..  తన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారని,.. వారు అలా అడగటం తనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నదని చెప్పింది శృతిహాసన్‌. ఇక ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ శృతీహాసన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 
 

56
Shruti Haasan

ఆమె మాట్లాడుతూ  మేమిద్దరం కళారంగంలో  ఉన్నాం. ఇద్దరి అభిరుచులు కలిశాయి.  అందుకే కలిసి సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తున్నాము.. అసలు మరో రెండుమూడేళ్ల వరకు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని క్లియర్ గా చెప్పేసింది శ్రుతి హాసన్. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

66

ఇక శ్రుతి హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో సీనియర్ హీరోలకు జతగా మెరిపించబోతోంది. తెలుగులో చిరంజీవి జోడీగా  వాల్తేరు వీరయ్య సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్‌ సలార్‌ మూవీతో పాటు.. బాలకృష్ణ వీరసింహారెడ్డి  సినిమాలో కూడా నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories