Janaki Kalaganaledu: మోసపోయానని తెలుసుకున్న రామచంద్ర.. షాక్ లో జ్ఞానాంబ కుటుంబం?

Published : Dec 30, 2022, 12:24 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 30 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Janaki Kalaganaledu: మోసపోయానని తెలుసుకున్న రామచంద్ర.. షాక్ లో జ్ఞానాంబ కుటుంబం?

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ అఖిల్ జాబ్ కోసం 20 లక్షలు పెట్టుబడి పెట్టడం ఏంటి రామ అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు రామచంద్ర అమ్మ నేను ఈ విషయం గురించి ఇప్పుడప్పుడే చెప్పకూడదు అనుకున్నాను కానీ నేను ఎవరికోసమైతే అప్పు చేశాను ఆ తమ్ముడే నన్ను దోషిని అన్నట్టుగా మాట్లాడుతుంటే తప్పక చెప్పనమ్మా అని అంటాడు. నా చిన్ననాటి స్నేహితుడు చరణ్ బెంగళూరులో మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక్కడ కంపెనీ పెడుతున్నాడు వాడి కంపెనీలో ఉద్యోగం కోసం వెళితే ఒక 20 లక్షలు కట్టాలని చెప్పాడు అందుకే అఖిల్ కోసం 20 లక్షలు కట్టాను అని అంటాడు రామచంద్ర.
 

27

అఖిల్ తో పాటు మరొక ముగ్గురు దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు మరొక మూడు నెలల్లో డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు అని అంటాడు రామచంద్ర. నా ద్వారా అఖిల్ కి జాబ్ వచ్చింది అని తెలిస్తే అఖిల్ బాధపడతాడు అని చెప్పలేదు అమ్మ అని అంటాడు. నువ్వు సూపర్ అన్నయ్య నువ్వు అమాయకుడు అనుకున్నాను కానీ నీకు ఇంత తెలివి ఎప్పుడు వచ్చింది అన్నయ్య అని అంటాడు అఖిల్. వాళ్లు నాకు ఫోన్ చేసి చెప్పారు కానీ నువ్వు వదిన ఆ డబ్బులను మాయ చేసి ఆ తప్పుడు నామీదకి నెట్టేస్తున్నారా అని అన్యాయంగా మాట్లాడతాడు అఖిల్. అప్పుడు జానకి మీ అన్నయ్య చెప్తుంది నిజమే నీ ఫీచర్ బాగుండాలని నీకోసమే ఆ 20 లక్షలు అప్పు చేసి మరి నీకు డబ్బు కట్టి నీకు జాబ్ ఇప్పించాడు అంటుంది జానకి.

37

అప్పుడు మల్లిక బావ గారు నువ్వు అడ్డంగా దొరికిపోయేసరికి ప్లేట్ బాగానే ఫిరాయిస్తున్నారు జానకి అని అంటుంది. అప్పుడు రామచంద్ర నీ నిజంగానే 20 లక్షల నా స్నేహితుడికి ఇచ్చాను అదే విషయాన్ని ఇప్పుడే నిరూపిస్తాను అని అంటాడు రామచంద్ర. అప్పుడు రామచంద్ర, అఖిల్, గోవిందరాజులు, విష్ణు అందరు కలిసి వెళ్తారు. ఆ తర్వాత జెస్సి వెళ్లి టాబ్లెట్స్ మింగుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మల్లిక వస్తుంది. జరిగినవి చూస్తే నీకు ఏమనిపిస్తుంది జెస్సి అనడంతో అక్క వాళ్ళు ఎప్పుడు మన మంచికే ఆలోచిస్తారు అనడంతో అప్పుడు మల్లిక జెస్సికి లేనిపోనివ్వని చెప్పి జెస్సీ మనసును చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
 

47

ఇప్పుడే మనం తెలివిగా ఆలోచించాలి మనకంటూ జీవితంలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి లేదంటే జీవితాంతం ఇదే ఇంట్లో మనం చాకిరీ చేయాల్సి వస్తుంది అని అంటుంది మల్లిక. అప్పుడు మల్లిక ఎన్ని చెప్పినా జెస్సి మాత్రం మల్లిక మాటలు వినదు. మరొకవైపు రామచంద్ర అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు చరణ్ రూమ్ కి వెళ్లి చూడగా అక్కడ చరణ్ లేకపోవడంతో అది చూసి రామచంద్ర షాక్ అవుతాడు. అప్పుడు అఖిల్ కూడా అక్కడున్న ప్లేస్ ని మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు గోవిందరాజులు టెన్షన్ పడుతూ ఎక్కడరా నీ ఫ్రెండు అడుగుతాడు.
 

57

ఇక్కడే ఉండాలి నాన్న ఎక్కడ వెళ్ళాడో కనపడటం లేదు అని అంటాడు. అప్పుడు అఖిల్ నువ్వు కూడా ఇక్కడికే ఇంటర్వ్యూ కు వచ్చావు కదా అనడంతో అవును నాన్న అని అంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఆఫీస్ మొత్తం వెతుకుతూ ఉండగా ఇంతలో సెక్యూరిటీ ఎదుపడతాడు. ఎవరండీ మీరు చెప్పా బెట్టకుండా లోపలికి వచ్చారు అనడంతో వెంటనే రామచంద్ర మా ఫ్రెండ్ కోసం వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళిక్కడ ఆఫీస్ పెట్టారు కదా అనడంతో వాళ్ళు నిన్ననే ఆఫీస్ కాలి చేసి వెళ్లిపోయారు అని అంటాడు. వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు ఇక్కడ బిజినెస్ మొదలు పెట్టడానికి వచ్చారు కదా అనగా అవన్నీ నాకు తెలియదండి వాళ్ళు నిన్నే ఖాళీ చేసి వెళ్లిపోయారు అని అంటాడు సెక్యూరిటీ.

67

వాళ్ళు ఈ ఆఫీస్ ని వారం రోజులు తీసుకున్నారు ఆ గడువు పూర్తయింది వెళ్లిపోయారు అనడంతో అందరూ షాక్ అవుతారు. పొద్దున్నుంచి మీలాగే ఎంతో మంది ఇక్కడికి వచ్చి వాళ్ల గురించి అడిగి వెళ్తున్నారు అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు రామచంద్ర ఫోన్ చేయగా ఫోన్ స్విచాఫ్ రావడంతో అప్పుడు మోసపోయామని అందరూ అర్థం చేసుకుంటారు. మరొకవైపు జ్ఞానాంబ జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ గోవిందరాజులు వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ రామచంద్ర వాళ్ళ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడు ఎలా అయినా ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకొని ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంతలోనే గోవిందరాజులు వాళ్ళు వస్తారు.
 

77

అందరు దిగులుగా వస్తుండడంతో ఏం జరిగిందో అర్థం కాక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జానకి మీ ఫ్రెండు ఎక్కడ ఉన్నాడు రామచంద్ర గారు అని అడగడంతో అప్పుడు రామచంద్ర బాధగా ఆఫీస్ కాలి చేసి వెళ్లిపోయారు అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు గోవిందరాజులు వాడు మనల్ని మోసం చేశాడు అనడంతో వెంటనే జ్ఞానాంబ మీ నాన్న చెప్పేది నిజమా రామా అనడంతో అవునమ్మా నాలాగే ఎంతోమందిని మోసం చేసి చరణ్ ఊరు విడిచి వెళ్లిపోయాడు అని అంటాడు. దాంతో జ్ఞానాంబ అవుతుంది. అప్పుడు మల్లిక అవకాశం దొరికింది కదా అని ఏ నాటకాలు వాడుతున్నారు బావగారు. మీరు జానకి కనుక సినిమాల్లోకి వెళితే మీకు మంచి మంచి అవార్డులు వస్తాయి అంటూ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది మల్లిక. ఇదంత జానకి ట్రైనింగ్ అయినా బావగారు అని అడుగుతుంది. మల్లికా ఇదంతా కూడా నీ ప్లానే అని నాకు తెలుసు జానకి అంటూ జానకి గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అఖిల్ కూడా మల్లికా మాదిరే మాట్లాడుతాడు.

click me!

Recommended Stories