Sadaa
సదా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. బ్లూ కలర్ ట్రెండీ వేర్ ధరించిన సదా ఓర చూపులతో నేరుగా గుండెల్లో పాగా వేసింది. ఆమె కవ్వింపు చర్యలు మెంటల్ తెప్పిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.
Sadaa
మిలీనియం ప్రారంభంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సదా.. భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఆమెకు మంచి ఆరంభం లభించింది. జయం మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. 2002లో తేజా దర్శకుడిగా తెరకెక్కిన జయం మూవీ సంచలన విజయం సాధించింది. వందల రోజులు థియేటర్స్ లో ఆడిన ఈ మూవీ హీరో నితిన్ కి కూడా డెబ్యూ మూవీ కావడం విశేషం.
Sadaa
జయం మూవీ సదా(Sada)కు యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చింది. దానితో స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కాయి. నాగ చిత్రంలో ఎన్టీఆర్(NTR) తో జతకట్టారు సదా. అలాగే వీరభద్ర మూవీలో బాలయ్య(Balakrishna) పక్కన ఛాన్స్ కొట్టేశారు. ఈ రెండు విజయం సాధించలేదు.విజయాల శాతం తక్కువ కావడంతో సదా కెరీర్ త్వరగా డౌన్ అయ్యింది. స్టార్ లేడీగా ఇండస్ట్రీని ఊపేస్తోంది అనుకుంటే టైరు టూ హీరోలకు పడిపోయారు.
Sadaa
జయం తర్వాత సదా కెరీర్ లో అతిపెద్ద హిట్ అపరిచితుడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.అపరిచితుడు మూవీలో విక్రమ్ కి జంటగా సదా నటించారు. ఈ మూవీలో సదా అగ్రహారం అమ్మాయిగా చాలా పద్ధతి గల పాత్ర చేశారు. అపరిచితుడు రేంజ్ హిట్ సదాకు మరలా పడలేదు.
ఇక చంద్రముఖి సినిమా నటించే ఛాన్స్ సదాకు మిస్ అయ్యిందట. డేట్స్ అడ్జెస్ట్ కాక చంద్రముఖి వదులుకున్నారట. ఆ సమయంలో తాను నటిస్తున్న సినిమా నిర్మాతను ఎంతగా బ్రతిమిలాడినా ఆయన కుదరదు అన్నాడట. చంద్రముఖి ఆఫర్ కోల్పోయినందుకు చాలా బాధపడ్డానని సదా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రజనీకాంత్ కెరీర్ లో చంద్రముఖి అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది.
ఇక హీరోయిన్ గా సదా కెరీర్ దాదాపు ముగిసినట్లే. అయితే ఆమె వదిన, అక్క వంటి పాత్రలు చేయడానికి సిద్ధం అంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ చేస్తున్నారు.
Sadaa
అలాగే తెలుగు బుల్లితెర షోస్ లో సందడి చేస్తున్నారు. ఈ మధ్య సదా కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఏది ఏమైనా ఆమెకు ఆఫర్స్ దక్కి, సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.