ఇక ఈసినిమాలో నటిస్తుండగానే రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేపై డేటింగ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతన్నారని రకరకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ విషయంలో నిజం లేదని భాగ్యశ్రీ ఓ సందర్భంలో క్లారిటీ కూడా ఇచ్చారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. హైదరాబాద్‌లోని ప్రముఖ లొకేషన్లలో రొమాంటిక్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమాకు చాలా ముఖ్యమైన క్లైమాక్స్ సీన్ కూడా షూటింగ్ లో ఉందని సమాచారం.
రామ్ పోతినేని పాట రాయడంతో ఆయన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. తమ అభిమాన హీరో మల్టీ టాలెంట్ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఈసారైనా 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాతో రామ్ హిట్ కొడతాడేమ్ అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమా హిట్ అయితే రామ్ హీరోగా మాత్రమే కాదు రచయితగా కూడా కొత్త జీవితం స్టార్ట్ చేయాలంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాట విడుదలయ్యాక, రామ్ పాటల రచయితగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.