`కూలీ` స్టార్స్ పారితోషికాలు.. రజనీ, నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, పూజా, శృతి హాసన్‌ ఎంత తీసుకున్నారో తెలుసా?

Published : Jul 16, 2025, 04:02 PM IST

`కూలీ` సినిమా భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది. మరి ఇందులో మెయిన్‌ కాస్టింగ్‌ తీసుకున్న పారితోషికాలు ఎంతనో తెలుసుకుందాం. 

PREV
15
`కూలీ` సినిమాపై భారీ అంచనాలు

ప్రస్తుతం ఇండియన్ మూవీస్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ `కూలీ`. అదే సమయంలో భారీ స్టార్‌ కాస్ట్ ఉన్న చిత్రం కూడా ఇదే. ఇందులో ఆరేడుగురు బిగ్‌ స్టార్స్ నటిస్తున్నారు. 

రజనీకాంత్‌ మెయిన్‌ హీరో కాగా, నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శృతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి వారు నటిస్తున్నారు. ఇప్పుడు ఇంతటి భారీ స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న చిత్రమిదే అని చెప్పొచ్చు. 

అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా `ఖైదీ`, `విక్రమ్‌`, లియో` వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రూపొందించిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

25
ఆగస్ట్ 2న `కూలీ` ట్రైలర్‌

సన్స్ పిక్చర్స్ నిర్మించిన `కూలీ` సినిమా వచ్చే నెల స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 14న విడుదల కానుంది. దీంతో ప్రమోషనల్‌ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. 

ఇప్పటికే రెండు పాటలను విడుదల చేశారు. పూజా హెగ్డే డాన్స్ చేసిన `మోనికా` సాంగ్‌ దుమ్మురేపుతుంది. ఆగస్ట్ 2న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ ట్రైలర్‌ కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి కంటెంట్ పరంగా ఎలాంటిదీ రిలీజ్‌ చేయలేదు. దీంతో కంటెంట్‌ని దాస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్ వినిపించిన నేపథ్యంలో ఆగస్ట్ 2న ట్రైలర్‌ని రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు.

35
`కూలీ` సినిమాలో ఆర్టిస్టుల పారితోషికాలపై లోకేష్‌ కామెంట్‌

తాజాగా ఇందులో నటిస్తున్న ఆర్టిస్టుల పారితోషికాలు చర్చనీయాంశం అవుతున్నాయి.  దీనిపై దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

రజనీకాంత్‌ పారితోషికంపై ఆయన కామెంట్‌ చేయనని తెలిపారు. అదే సమయంలో తన పారితోషికంపై క్లారిటీ ఇచ్చారు. రూ.50కోట్లు `కూలీ` చిత్రానికి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 

ఈ పారితోషికం తీసుకోవడానికి తన మూడేళ్ల కష్టం ఉందని, `లియో` సక్సెస్‌ కారణమని తెలిపారు. అది ఆరు వందల కోట్లు వసూలు చేసిందని, అందుకే తనకు ఈ స్థాయిలో పారితోషికం ఇస్తున్నారని చెప్పారు.

45
`కూలీ` ఆర్టిస్ట్ ల పారితోషికాలు

`కూలీ` చిత్రానికి రజనీకాంత్‌ అందుకున్న పారితోషికం రూ. 150కోట్లు అని తెలుస్తుంది. వీటితోపాటు నాగార్జునకి రూ. 24కోట్లు ఇచ్చినట్టు టాక్‌. ఇంకోవైపు అమీర్‌ ఖాన్‌ కి కూడా భారీగానే అందింది. 

ఆయనది కోమియో రోల్‌ అని, చివర్లో వచ్చిన చాలా ఇంపాక్ట్ చూపించే పాత్ర అట. ఆయనకు సుమారు రూ.25కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అలాగే ఉపేంద్రకి పది కోట్ల వరకు అందిందని తెలుస్తుంది.

 శృతి హాసన్‌కి నాలుగు కోట్లు, `మోనికా` సాంగ్‌లో మెరిసిన పూజా హెగ్డే కి రెండు కోట్లు ఇచ్చారట. మిగిలిన కాస్టింగ్‌ అంతా కలిపి రూ.5-10 కోట్ల వరకు ఉంటుందని ఉంటుందని సమాచారం.

55
`కూలీ` బడ్జెట్‌, బిజినెస్‌

ఇలా `కూలీ` కాస్టింగ్‌ పారితోషికం, టెక్నీషియన్ల పారితోషికం అంతా కలిపి రూ.280కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు టాక్‌. 

ఇదే నిజమైతే ఈ మూవీ సుమారు ఎనిమిది వందల కోట్ల వరకు కలెక్షన్లని రాబట్టాలి. సినిమాపై మంచి బజ్‌ ఉన్న నేపథ్యంలో అది సాధ్యమే అంటున్నారు. 

సినిమాలో మ్యాటర్ ఉంటే, `విక్రమ్‌` రేంజ్‌లో ఆకట్టుకుంటే వెయ్యి కోట్లు పెద్ద సమస్య కాదు. మరి ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. 

అయితే ఈ సినిమాకి థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ కూడా కూడా భారీగానే అయ్యిందని తెలుస్తోంది. నిర్మాతలు సేఫ్‌లోనే ఉన్నట్టు సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories