చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ షాక్..

Published : Sep 23, 2025, 10:54 AM IST

Ram Gopal Varma - Mega Family: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలకు కేరాఫ్. మెగా ఫ్యామిలీ విషయంలో తొలిసారి పాజిటివ్‌గా స్పందిస్తూ.. మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు ఆర్జీవీ. ఇంతకీ ఏమన్నారంటే?

PREV
16
రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనగానే వివాదాస్పద సినిమాలు, సెన్సేషనల్ ట్వీట్లు, అడ్డుఅదుపులేని కామెంట్లు గుర్తుకు వస్తుంది. కానీ, ఒకప్పుడు ఆర్జీవీ భారత సినీ ఇండస్ట్రీ ట్రెండ్‌ను మార్చిన సెన్సేషనల్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్, స్టోరీస్టైల్, కొత్త సాంకేతిక ప్రయత్నాలతో సినీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. కేవలం కాంట్రవర్సీకి పరిమితం కాకుండా.. సినిమా, భాష, థీమ్స్, ఎడిటింగ్, స్క్రీన్‌ ప్లే విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. అలాంటి సక్సెస్ పుల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తారు.

26
వివాదాలను కేరాఫ్

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేవలం టాలీవుడ్ హీరోలతోనే కాదు. బాలీవుడ్‌లో బిగ్ బీ అమిత్ బచ్చన్ లాంటి బడా హీరోలతో బస్టర్ మూవీస్ తీశారు. ఒకప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే, కాలానుగుణంగా ప్రేక్షకులను నచ్చేలా సినిమాలు తీయలేకపోవడ, వరుస ఫ్లాప్‌లు రావడం వలన వర్మ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలు, రాజకీయ నాయకుల బయోపిక్‌ లను తనకు నచ్చినట్టు తెరకెక్కిస్తూ తరుచు వివాదాలకు కేరాఫ్ గా మారారు.

36
చిరంజీవి 47 ఏళ్ళ సినీ ప్రయాణం

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ ఏడాదికి 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1978లో ‘ప్రాణం ఖరీదు’సినిమాతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ తన సినీప్రస్థానం ప్రారంభించారు. తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యిన చిరంజీవి 155 సినిమాల్లో నటించి, కఠోర శ్రమతో మెగాస్టార్ స్థాయి చేరారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి‘"22 సెప్టెంబర్ 1978న ‘ప్రాణం ఖరీదు’తో నటుడిగా మీ ముందుకొచ్చాను. ఈ 47 ఏళ్ల ప్రయాణంలో మీరు చూపిన ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను" అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

46
పవన్ కళ్యాణ్ స్పందన

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. "పుట్టుకతోనే మా పెద్దన్నయ్య ఓ ఫైటర్. రిటైర్మెంట్ అనేది ఆయన జీవితంలో లేదు. ఇతరులకు అండగా నిలిచే గుణం ఆయనది" అంటూ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. "ధన్యవాదాలు తమ్ముడూ…నీ మాట‌లు నా మ‌న‌సుకు తాకాయి. ‘ఓజీ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఘన విజయం సాధించాలి" అని పేర్కొన్నారు.

56
మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ ట్వీట్

తాజాగా మెగాస్టార్- పవర్ స్టార్ ఎమోషనల్ ట్వీట్లపై డైరెక్టర్ ఆర్జీవీ తనదైన స్టైల్లో కాకుండా పాజిటివ్ కామెంట్ చేశారు. "చిరు, పవన్ కలిసి సినిమా చేస్తే ప్రపంచంలోని తెలుగు వాళ్లందరికీ అది ఒక మెగా పవర్ ఫేవర్ అవుతుంది. అది ఈ శతాబ్దానికి మెగా పవర్ సినిమా అవుతుంది" అని పేర్కొన్నారు. ఇలా మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో పాజిటివ్‌గా స్పందిస్తూ.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. పాజిటివ్‌గా స్పందిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చారు.

66
గతంలో నెగెటివ్ కామెంట్స్

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ట్వీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వర్మ చేసిన మొదటి పాజిటివ్ కామెంట్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ తో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిన రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవి) అభిప్రాయాన్ని మార్చుకుని అభిమానులను ఆశ్చర్యపరిచారు. మరోవైపు ఆర్జీవీని అంత ఈజీగా నమ్మకూడదని సినీ వర్గాలు అంటున్నారు. ఆయన ఎప్పుడూ మారిపోతూ ఉంటారని, సినిమాల కంటే కాంట్రవర్సీల కోసం ఎక్కువగా హాట్ టాపిక్‌గా నిలిచే అవకాశముంటుందని కూడా చెబుతున్నారు. ఏ సినిమా తీసుకున్నా అస్స‌లు విజయం సాధించలేకపోతున్న వర్మ, అభిమానుల దృష్టిని ఆకర్షించడానికి అప్పుడప్పుడూ ఇలాంటి ట్వీట్లు చేస్తూ ఉంటారనే విషయం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories