Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఫేమ్ అవికా గోర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన ప్రియుడిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఇంతకీ ఆమెకు కాబోయే వరుడు ఎవరు? పెళ్లి ముహూర్తం ఎప్పుడు?
చిన్నారి పెళ్లి కూతురు (బాలికా వధూ) సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన నటి అవికా గోర్. ఎట్టకేలకి పెళ్లి పీటలెక్కబోతున్నారు. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో అభిమానులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. బాలనటిగా అందరి మనసులనూ గెలుచుకున్న అవికా, ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. 27 ఏళ్ల ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన ప్రియుడిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. ఇంతకీ ఆమెకు కాబోయే వరుడు ఎవరు? పెళ్లి ముహూర్తం ఎప్పుడు?
25
సినీ ప్రయాణం
ఉయ్యాలా జంపాలాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అవికా గోర్, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, #బ్రో, థాంక్యూ వంటి చిత్రాల్లో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అలాగే వెబ్‌సిరీస్‌లలోనూ అడుగుపెట్టి మ్యాన్షన్ 24, వధువు వంటి ప్రాజెక్టుల ద్వారా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఆమె చిత్రం షణ్ముఖ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే, ఆశించినంత స్థాయి బ్రేక్ రాకపోయినా, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అవికా, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు.
35
నిశ్చితార్థం
అవికా గోర్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. గత 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె ప్రియుడు మిలింద్ చంద్వానీతో నిశ్చితార్థం చేసుకుంది. జూన్ 11, 2025న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిశ్చితార్థం ప్రకటించి, అభిమానులను షాక్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ పోస్ట్‌లో “అతడు ప్రపోజ్ చేశాడు, నేను నవ్వాను, ఏడ్చాను.. అతడి ప్రేమకు అవును చెప్పడం నాకు చాలా సులభంగా అనిపించింది” అంటూ తన భావోద్వేగపూరిత పోస్టులో పేర్కొంది
అవికా గోర్ జీవిత భాగస్వామి మిలింద్ చంద్వానీ. ఆయన సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేసిన ఆయన, క్యాంప్ డైరీస్ అనే ఎన్జీవోను నడుపుతున్నారు. 2019లో ఎంవీటీలో ప్రసారమైన రోడీస్ రియల్ హీరోస్ షోలో పాల్గొన్న మిలింద్, అదే సమయంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా అవికాతో పరిచయం అయ్యారు. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, తరువాత ప్రేమగా మారింది. 2020 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు.
55
పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే ?
27 ఏళ్ల అవికా పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా అవికా తన పెళ్లి తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 30న అవికా – మిలింద్ వివాహం జరగనుంది. ఈ వార్త బయటకు రాగానే అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేస్తున్న ఆమె, పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి. అయితే అభిమానులు మాత్రం “బాలికా వధూ”గా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు “నిజమైన వధువు”గా మారిందని కామెంట్స్ చేస్తున్నారు.