భారీ అంచనాలతో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి గాను పవన్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్ ఇతర నటీనటులు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఈ కథనంలో చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్ర సందడి గురువారం నుంచి థియేటర్స్ లో ప్రారంభం కాబోతోంది. శుక్రవారం సెప్టెంబర్ 25న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. గురువారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో రాత్రి 10 గంటల షోకి, తెలంగాణలో రాత్రి 9 గంటల పైడ్ పీమియర్స్ కి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ప్రీమియర్ షోల టికెట్ ధర వేలల్లో పలుకుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఓజీపై స్కై లెవల్ అంచనాలు నెలకొన్నాయి.
25
ఓజీ నటీనటుల రెమ్యునరేషన్స్
రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఓజీ మూవీ గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు కూడా బయటకి వచ్చాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాన నటీనటులు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో వివరాల్లో తెలుసుకుందాం.
35
పవన్ కళ్యాణ్ ఎంత తీసుకున్నారంటే
కథానాయకుడిగా నటిస్తున్న పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి గాను పవన్ 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి 6 నుంచి 8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట.
ప్రియాంక అరుళ్ మోహన్ రీసెంట్ గా సరిపోదా శనివారం చిత్రంలో హిట్ అందుకుంది. ఓజీ చిత్రానికి ఆమె 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారట. ఓజీ మూవీలో ఆమెది తక్కువ నిడివి ఉన్న పాత్ర. అయినప్పటికీ మంచి పారితోషికమే దక్కింది అని చెప్పొచ్చు. విలన్ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న నటుడు. హీరోగా పలు చిత్రాలు చేశారు. ఓజీ చిత్రానికి ఆయన 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారట.
55
కీలక పాత్రల్లో శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్
కీలక పాత్రలో నటిస్తున్న శ్రీయ రెడ్డి 40 లక్షలు, అర్జున్ దాస్ 40 లక్షలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ 1.5 కోట్లు అందుకుంటున్నారట. ఇక సంగీత దర్శకుడు తమన్ 5 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఓజీ మూవీకి గాను వీరి రెమ్యునరేషన్స్ మాత్రమే 120 కోట్లు దాటిపోతున్నాయి. ఓవరాల్ గా సినిమా మేకింగ్ బడ్జెట్ 200 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఓజీ మూవీ 50 కోట్ల గ్రాస్ వాసులు చేసినట్లు తెలుస్తోంది.