Upasana Seemantham Photos: రామ్ చరణ్ రెండోసారి తండ్రి కాబోతున్నారు. ఉపాసన మరోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. దీపావళి సందర్భంగా సీమంతం చేశారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ దీపావళి మెగా ఫ్యామిలీకి ఒక్కటి కాదు, రెండు పండగలను తీసుకొచ్చింది. మెగాస్టార్ ఫ్యామిలీలోకి మరో వారసులు రాబోతున్నారు. రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఉపాసన రెండో బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఇప్పటికే వీరికి కూతురు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారు ఆమె. మరో బిడ్డకి జన్మనివ్వబోతున్నారు.
218
ఉపాసన సీమంతం వేడుకలో కుటుంబ సభ్యులు
తాజాగా మెగా కోడలు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన నేపథ్యంలో తాజాగా సీమంతం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సీమంతం వేడుకని నిర్వహించారు. క్లోజ్ ఫ్యామిలీతోపాటు ఇండస్ట్రీ నుంచి అతికొద్ది మంది స్టార్స్ మాత్రమే హాజరయ్యారు. చిరంజీవికి దగ్గరైన వాళ్లు మాత్రమే సందడి చేశారు.
318
ఉపాసన సీమంతం వేడుకలో సందడి చేసిన నాగార్జున ఫ్యామిలీ
రామ్ చరణ్ భార్య ఉపాసన సీమంతం వేడుకలో నాగార్జున, అమల, వెంకటేష్ భార్యభర్తలు, అలాగే నయనతార భార్యభర్తలు పాల్గొన్నారు. వీరితోపాటు నాగబాబు ఫ్యామిలీ, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక, వైష్ణవ్ తేజ్, సుస్మితతోపాటు ఉపాసన కుటుంబం పాల్గొంది. పవన్ కళ్యాణ్ లేరు, కానీ ఆయన భార్య అన్నా లెజినోవా సందడి చేయడం విశేషం.
ఉపాసన సీమంతానికి సంబంధించిన వీడియోని ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ దీపావళి తమ ఇంట డబుల్ సెలబ్రేషన్ తీసుకొచ్చిందని పేర్కొంది. ఈ వీడియో వైరల్ అవుతుంది. అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.
518
వదిన సీమంతం వేడుకలో సుస్మిత
ఉపాసన సీమంతం వేడుకలో సందడి చేసిన చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.
618
నాగబాబు దంపతుల సందడి
ఉపాసన సీమంతం వేడుకలో సందడి చేసిన నాగబాబు దంపతులు.
718
ఆనందంలో రామ్ చరణ్
తాను రెండో సారి తండ్రి కాబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
818
మామతో సంతోషం పంచుకుంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్న నేపథ్యంలో ఉపాసన సీమంతం వేడుకలో తన ఆనందాన్ని మామతో పంచుకుంటున్న సందర్భం. ఇందులో చరణ్ కూతురు క్లీంకార కూడా ఉండటం విశేషం.
918
వైష్ణవ్ తేజ్ సందడి
ఉపాసన సీమంతం వేడుకలో సందడి చేసిన హీరో వైష్ణవ్ తేజ్.
1018
లావణ్య త్రిపాఠి స్పెషల్ ఎట్రాక్షన్
ఉపాసన సీమంతం వేడుకలో మెగా మరో కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
1118
నయనతార జంట హల్‌చల్
ఉపాసన సీమంతం వేడుకలో హీరోయిన్ నయనతార ఫ్యామిలీ సందడి చేసింది. ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్, పిల్లలు కూడా పాల్గొన్నారు. నయనతార ప్రస్తుతం చిరంజీవితో `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
1218
ఉపాసనకి ముద్దుపెట్టిన అంజనాదేవి
మనవరాలు ఉపాసన సీమంతం వేడుకలో చిరంజీవి తల్లి అంజనా దేవి పాల్గొన్నారు. ఆమె ఉపాసనకి ముద్దు పెట్టడం విశేషం.
1318
కొడుకుతో వరుణ్ తేజ్
ఇటీవలే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు పండంటి మగబిడ్డకి జన్మినిచ్చిన విషయం తెలిసిందే. కొడుకుతో కలిసి ఉపాసన సీమంతం వేడుకలో పాల్గొన్నారు వరుణ్ తేజ్.
1418
పేరెంట్స్ తో ఉపాసన
తన సీమంతం వేడుకలో పేరెంట్స్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చిన ఉపాసన.
1518
అత్త సురేఖ సందడి
కోడలు ఉపాసన సీమంతం వేడుకలో అత్త సురేఖ సందడి వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఉపాసన అమ్మతో కలిసి ఆనందం పంచుకుంటున్న సందర్భం.
1618
వెంకటేష్ దంపతులు హల్‌చల్
ఉపాసన సీమంతం వేడుకలో హీరో వెంకటేష్ సతీసమేతంగా పాల్గొన్నారు. స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. చిరు, వెంకీ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇప్పుడు `మన శంకరవరప్రసాద్ గారు` లో వెంకీ గెస్ట్ రోల్ చేస్తున్నారు.