కొణిదెల ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉపాసన, రాంచరణ్ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలో ఎవరు పెద్దవారో ఈ కథనంలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. రాంచరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. జనవరి 31 రాత్రి ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. అపోలో ఆసుపత్రిలో డెలివరీ జరిగింది. ఒక పాప, ఒక బాబు జన్మించినట్లు చిరంజీవి ఆల్రెడీ ఈ శుభవార్తని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
25
చిరంజీవి కామెంట్స్
తమ సంతోషాన్ని మరింతగా పంచుకునేందుకు చిరంజీవి అపోలో ఆసుపత్రి వద్ద మీడియా సమావేశం కూడా నిర్వహించారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చిరంజీవి ఒక గ్రాండ్ ఫాదర్ గా తన సంతోషాన్ని పంచుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనిపిస్తోంది. రాంచరణ్, ఉపాసన లకు రాత్రి కవలలు జన్మించారు. ఇద్దరు పిల్లలు, ఉపాసన ఆరోగ్యంగా ఉన్నారు.
35
నా ఆనందానికి అవధులు లేవు
భగవంతుడి దయ, హనుమంతుడి ఆశీస్సుల వల్ల ఒక ఆడబిడ్డ, మగ బిడ్డ పుట్టారు. ఈ శుభవార్తని మీ అందరితో పంచుకుంటుంటే నా ఆనందానికి అవధులు లేవు అని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత ఆయన ఉపాసనకి డెలివరీ చేసిన డాక్టర్ల బృందాన్ని పరిచయం చేశారు. వారికి, అపోలో సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాసనకి ప్రసవం చేసిన వైద్యుల బృందంలో డాక్టర్ సుమన ప్రధానంగా ఉన్నారు. క్లీంకార పుట్టినప్పుడు కూడా సుమన గారే డెలివరీ చేశారు అని చిరంజీవి తెలిపారు. అదే విధంగా డాక్టర్ రుమా సిన్హా, డాక్టర్ లతా లని కూడా చిరంజీవి పరిచయం చేశారు. డాక్టర్ సుమన మాట్లాడుతూ అంతా సవ్యంగా జరిగింది. ఇద్దరు పిల్లలు బావున్నారు. ఉపాసన కూడా రికవరీ అవుతోంది అని తెలిపారు.
55
కవల పిల్లల్లో ఎవరు పెద్ద ?
డాక్టర్ లత మాట్లాడుతూ.. ఇద్దరు కవల పిల్లల్లో ఎవరు పెద్దవారో తేల్చి చెప్పారు. అబ్బాయి ముందు పుట్టాడు, అమ్మాయి తర్వాత పుట్టింది అని లత తెలిపారు. ఇద్దరూ చాలా బావున్నారు అని అన్నారు.