మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ రీసెంట్ గా అంబాని పెళ్ళిలో మెరుపులు మెరిపించాడు.. ఆతరువాత కనిపించలేదు.. ఇటు హైదరాబాద్ కూడ రాలేదు.. మరి ఎటు వెళ్లినట్టు.. అటు నుంచ అటే సరాసరి ఫారెన్ చెక్కేశాడా...? తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అసలు సంగతేంటంటే..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు. రెండు పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై ఉండగా.. రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఆసినిమాలపై అంచనాలు అందనంత ఎత్తుకు వెళ్ళిపోతున్నాయి. అంతే కాదు.. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ అందుకున్న తరువాత నుంచి రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఎన్నో గౌరవాలు.. మరెన్నో సత్కారాలు.. ఆయన అకౌంట్ లో పడిపోతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా.. కేంద్రం నుంచి కూడా చరణ్ ఎన్నో గౌరవాలు అందుకున్నారు. అంతే కాదు హాలీవుడ్ రేంజ్ లో అవతార్ దర్శకుడు జేమ్స్ కామరూన్ కూడా చరణ్ నటనను.. ఆయన బిహేవియర్ ను పొగుడుతూ.. శభాష్అన్నాడంటే.. చరణ్ రేంజ్ ఏక్కడికి ఎగబాకిందో అర్ధం అవుతూనే ఉంది. ఈక్రమంలో రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. అవును ఆయన మరో అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నాడట. ఇంతకీ విషయం ఏంటంటే..?
గేమ్ ఛేంజర్ సినిమాలో తన షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రామ్‌చరణ్ ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నాడు.. త్వరలో బుచ్చిబాబు సినిమాలో జాయిన్ కాబోతున్నాడు. ఈక్రమంలో రీసెంట్ గా ఫ్యామిలీతో కలసి అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లిన రామ్‌చరణ్… అక్కడ నుండి స్పెషల్ ప్లైట్‌లో లండన్ చెక్కెశాడట. ఇంతకీ చరణ్ లండన్ ఎందుకు వెళ్లాడో తెలుసా.. అక్కడ ఫేమస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నుంచి ఆయనకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అర్ధ అయ్యి ఉంటుంది రామ్ చరణ్ అందుకోబోతున్న గౌరవం ఏంటో..
లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంకి ఎలాంటి గుర్తింపు ఉందో అందరికి తెలిసిందే.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీలు.. వారి వారి రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుల మైనపు బొమ్మలు ఈ మ్యూజియంలో పెడుతున్నారు. ఇండియా నుంచి కూడా ఎంతో మంది స్టార్స్ మైనపు బొమ్మలు ఇందులో ఏర్పాటు చేశారు.
58
తెలుగు నుంచి కూడా కొంత మందికి ఈ గౌరవం దక్కింది. అందులో ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. బన్నీ బొమ్మ రీసెంట్ గా అందులో యాడ్ చేశారు.
68
ఇక తాజాగా ఈలిస్ట్ లో ఇప్పుడు రాయ్ చరణ్ పేరు కూడా చేరింది. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు. లండన్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టాలీవుడ్ టాక్ మాత్రమే. రామ్ చరణ్ స్టార్ డమ్ తో పాటు.. ఆయనకు ఉన్న పాపులారిటీ దృశ్య వారు ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారట.
78
ఈ క్రమంలో అందుకోసం కొలతలు ఇవ్వడానికే చరణ్ లండన్ వెళ్ళారు అంటున్నారు కొంత మంది సినీ జనాలు. చరణ్ ముందుగానే ఓ 2 వారాలు హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేశారట. పనిలో పనిగా మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తయారు చేస్తున్న మైనపు బొమ్మకు అవసరమైన కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే. రామ్ చరణ్ ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పీ రైమ్‌ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్లు ఏర్పాటు చేయబోతున్నారట..
88
ఈ విషయం నిజం అయితే.. రామ్ చరణ్ తో పాటు.. ఆయన ఎంతో ఇష్టపడే కుక్క పిల్లకు కూడా అరుదైన గౌరవం దక్కబోతోంది. ఇక ఈ విషయం తెలిసి మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. పండగ చేసుకుంటున్నారు.