టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అతడే, తేల్చేసిన లేటెస్ట్ సర్వే... మెగా హీరోలకు షాక్, సత్తా చాటిన ఎన్టీఆర్!

Published : Jul 18, 2024, 07:05 AM IST

టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరనే చర్చ కొనసాగుతుండగా... అతడే అని ఓ సర్వే తేల్చేసింది. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ నెంబర్ గేమ్ లో మెగా హీరోలు వెనుకబడ్డారు.   

PREV
111
టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అతడే, తేల్చేసిన లేటెస్ట్ సర్వే... మెగా హీరోలకు షాక్, సత్తా చాటిన ఎన్టీఆర్!


ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్. ఆయన తర్వాత ఆ స్థానం చిరంజీవికి దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఉన్నారు. ఈ జనరేషన్ స్టార్స్ లో టాలీవుడ్ నెంబర్ హీరో ఎవరనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది. తాజా సర్వే తో దీనిపై స్పష్టత వచ్చింది. సదరు సంస్థ టాలీవుడ్ లో అగ్ర స్థానం ఎవరిదో తేల్చేసింది. జూన్ 2024 వరకు జరిపిన సర్వే ఫలితాలను బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ప్రకటించింది. 

211
Vijay Devarakonda

టైర్ టు హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ కు టాప్ 10లో చోటు దక్కింది. ఈ రౌడీ హీరో 10వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడితే స్టార్ హీరోల సరసన చేసే అవకాశం ఉంది. 

 

311

టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సీనియర్ హీరో చిరంజీవి. విశ్వంభర టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న చిరంజీవికి మూవీ లవర్స్ 9వ స్థానం ఇచ్చారు. 

411

ఎలాంటి నేపథ్యంలో లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టిన రవితేజ అంచెలంచెలుగా ఎదిగాడు. ఆయనకు క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. అయినా ఫేమ్ తగ్గలేదు. రవితేజ 8వ స్థానంలో ఉన్నాడు. 
 

511

నేచురల్ స్టార్ నానికి ఆడియన్స్ 7వ స్థానం ఇవ్వడం విశేషం. నాని గత చిత్రాలు దసరా, హాయ్ నాన్న విజయాలు సాధించాయి. ఇది ఆయన ర్యాంకింగ్ మీద ప్రభావం చూపింది. 

 

611

అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కి టాప్ 5లో కూడా చోటు దక్కలేదు. రాజకీయంగా బిజీ అయిన పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి తగ్గించాడు. ఇది ఒక కారణం. పవన్ కళ్యాణ్ 6వ స్థానంలో ఉన్నాడు. 

711

ఆర్ ఆర్ ఆర్ స్టార్ రామ్ చరణ్ కి 5వ స్థానం దక్కింది. టాప్ 5లో ఉన్న ఒకే ఒక మెగా హీరో రామ్ చరణ్. ఆయన ఎన్టీఆర్, అల్లు అర్జున్ కంటే వెనుకబడ్డాడు. నెక్స్ట్ గేమ్ ఛేంజర్ తో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. 

811

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఆడియన్స్ 4వ స్థానం ఇచ్చారు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి వాయిదా పడింది. 

 

911
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబుకు 3వ స్థానం దక్కింది. మహేష్ బాబు లేటెస్ట్ రిలీజ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఎస్ఎస్ఎంబి 29 దర్శకుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇది పాన్ వరల్డ్ మూవీ. 

1011

అనూహ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, చరణ్ లను వెనక్కి నెట్టి ఎన్టీఆర్ 2వ స్థానం కైవసం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. ఎన్టీఆర్ నుంచి మరో చిత్రం విడుదల కాలేదు. అయినా ఎన్టీఆర్ కి బెటర్ పొజిషన్ ఇచ్చారు. 

 

1111
Tollywood Top 10 Heroes

ఇక టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా అగ్రస్థానం ప్రభాస్ కి దక్కింది. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఇటీవల కల్కి 2829 AD  చిత్రంతో రూ. 1000 కోట్లు కొల్లగొట్టాడు. ప్రభాస్ కి ఇది రెండో వెయ్యి కోట్ల మూవీ. వసూళ్ల పరంగా ప్రభాస్ దరిదాపుల్లో మరొక హీరో లేడు. కాబట్టి ఆర్మాక్స్ సర్వే ప్రకారం ప్రభాస్ టాలీవుడ్ లో టాప్.. 

Read more Photos on
click me!

Recommended Stories