అంబానీల వివాహంపై అట్లీ 'స్పెషల్ ఫిల్మ్' ,అమితాబ్ సాయింతో....

Published : Jul 18, 2024, 10:46 AM IST

 అట్లీకు ఈ వివాహానికి ఆహ్వానం అందింది. ఈ వివాహానికి సినీ,రాజకీయ,వ్యాపార,తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో,తమదైన సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు.

PREV
110
అంబానీల వివాహంపై  అట్లీ 'స్పెషల్ ఫిల్మ్' ,అమితాబ్ సాయింతో....
Atlee


గత కొద్ది  రోజులుగా ముఖేశ్ అంబానీ ఇంట్లో పెండ్లి వేడుకలు టాపిక్కే ఎక్కడ విన్నా. వరుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ‘శుభ్‌ వివాహ్‌’ఘనంగా జరిగింది.ఈ వేడుకకు తారా లోకం కదిలింది.  ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఆనంద్ అంబానీ రాధిక మర్చంట్ వివాహానికి సినీ స్టార్, స్పోర్ట్స్ సెలబ్రెటీలు, రాజకీయనాయకులు, గాయకులు, డాన్సర్స్ ఇలా ఎక్కడెక్కడి వాళ్లు తమ రంగంలో ఓ స్దాయికి వెళ్లిన వాళ్లంతా పిలుపులు అందుకుని హాజరయ్యారు. ఆ ఫొటోలు, వీడియోలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. అదే విధంగా ఈ వివాహంలో చోటు చేసుకన్న స్పెషాలిటీస్ గురించి కూడా మీడియా భారీ ఎత్తున కవరేజ్ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ విషయం బయిటకు వచ్చి,అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేమిటంటే..

210


అదేమిటంటే... షారూఖ్ ఖాన్ తో జవాన్ వంటి సూపర్ హిట్ కొట్టిన అట్లీ..అంబానీ వివాహ వేడుకల్లో తనదైన పాత్రను నిర్వహించారు. తమిళ దర్శకుడైన అట్లికు బాలీవుడ్ లో కూడా చాలా పాపులారిటీ ఉంది. సోష‌ల్ మెసేజ్‌కు స్టైలిష్ యాక్ష‌న్ మాస్ అంశాల‌ను మేళ‌వించి సినిమాలు తెర‌కెక్కించ‌డం డైరెక్ట‌ర్ అట్లీ స్పెషాలిటీ.

310
Atlee


విజయ్ చేసిన తేరీ నుంచి నిన్నటి  జ‌వాన్ వ‌ర‌కు ఈ ఫార్ములాలో అట్లీ రూపొందించిన‌ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అట్లీ. షారుఖ్‌ఖాన్ హీరోగా గ‌త ఏడాది విడుద‌లైన జ‌వాన్ మూవీ 1100 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. బాలీవుడ్ హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. బాలీవుడ్ స్టార్స్ అందరూ అట్లీతో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

410
Priya Atlee


ఈ నేపధ్యంలో అట్లీకు ఈ వివాహానికి ఆహ్వానం అందింది. ఈ వివాహానికి సినీ,రాజకీయ,వ్యాపార,తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో,తమదైన సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు.వీరి వివాహ వేడుక భారతదేశంలోనే(ముంబై )జరిగిన బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా, సౌత్,హాలీవుడ్ నుంచి కూడా అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే అట్లీ మాత్రం గుర్తుండిపోయేలా ఒకటి చేసాడు.

510
Atlee, Pooja Vibes


ఈ ఫిల్మ్ మేకర్...అనంత్ అంబాని, రాధికా మర్చంట్ ల వివాహానికి సంభందించి పది నిముషాల యానిమేటెట్ ఫిల్మ్ ను క్రియేట్ చేసారు. ఈ వీడియోకు అమీతాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయాన్ని అంబానీల పంక్షన్ లలో తన వంతు పాత్ర నిర్వహించే దాదాపు పీఆర్వో లాంటి యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా వివరించారు. ఆయన బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్ చాలా ఫేమస్. అందులో ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
 

610


ఈ వివాహం కు చెందిన బారాత్ లో ...పది నిముషాల అట్లీ తయారు చేసిన సినిమాని వెడ్డింగ్ గెస్ట్ లకు చూపించారు. ఈ వీడియో... వెడ్డింగ్ ఈవెంట్స్ ని సింపుల్ గా పదినిముషాల్లో చూపెట్టి అందరినీ మెప్పించింది. అది అట్లీ వారి వివాహానికి ఇచ్చిన గిప్ట్ గా చెప్తున్నారు. అయితే ఈ వీడియో ఖర్చు మొత్తం అంబానీలదే అని మరికొంతమంది అంటున్నారు. ఎవరు ఎలా ఏమి చెప్పినా వీడియో అక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిందనేది నిజం. 
 

710
ambani


ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకలో సెలబ్రెటీల డ్యాన్స్ లు,వారి ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అంబానీ పెళ్లిలో తెలుగు హీరోల సందడి చూసుకుంటే..మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు రాంచరణ్,రానా దగ్గుబాటి తమ భార్యలతో హాజరయ్యారు.అలాగే విక్టరీ వెంకటేష్ కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కనిపించారు.ఎవరూ ఊహించని విధంగా వేడుకలో మహేష్ చాలా రోజుల తర్వాత లాంగ్ హెయిర్ తో కనిపించారు.బ్లాక్ సూట్ ధరించిన మహేష్ యమా స్టయిల్ గా హుందాగా ఉన్నారు.ఆయన సతీమణి నమ్రత,కుమార్తె సితార ట్రెడిషనల్ గా కనిపించారు.సితార కూడా తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకర్షించింది.
 

810


అలాగే  రామ్ చరణ్ వైట్ కుర్తా ఫైజామ్ ధరించి స్టైలిష్ గా కనిపించాడు.తన స్టైలిష్ యాటిట్యూడ్ తో అదిరిపోయే ఫోజులు ఇచ్చాడు.ఉపాసన స్కె బ్లూ కలర్ శారీలో ట్రెడిషనల్ గా మెరిశారు. అలాగే వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి కూడా తన సతీమణి మిహీక బజాజ్ తో కలసి తెగ సందడి చేశాడు.రానా వైట్ డ్రెస్ ధరించగా,మిహీక రెడ్ లెహంగాలో కలర్ ఫుల్ గా కనిపించారు.బాహుబలితో,ఘాజి వంటి సినిమాలతో రానా నార్త్ లోమంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

910
Ambani family

 
ఇకపోతే సూపర్ స్టార్ రజినీకాంత్ ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,షారుఖ్ ఖాన్,రణవీర్ సింగ్,అనిల్ కపూర్,సూర్య జ్యోతిక,యష్,సల్మాన్‌ ఖాన్‌,విక్కీ కౌశల్‌ మరియు క్రికెట్ గాడ్ సచిన్,ధోని తదితరులు అటెండ్ అయ్యారు.ఇక ఈ వేడుకలో స్టార్ హీరోయిన్ నయనతార రెడ్ కార్పెట్ మీద దిగి,తన ఫిల్మ్ మేకర్ భర్త విఘ్నేష్ శివన్‌తో ఫోజులిచ్చింది.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా,తన భర్త నిక్ జోనస్ తో సందడి చేసింది.పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ కూడా తన సతీమణితో సందడి చేశారు. 
 

1010


రజినీకాంత్ తో పాటు తన భార్య లత,కూతురుగు ఐశ్వర్య,మనవడితో కలిసి వెళ్లారు.అయితే,ఈ ఈవెంట్ లో రజినీ తనదైన స్టెప్పులతో  డ్యాన్స్ అదరగొట్టేసారు.రజినీకాంత్ డ్యాన్స్ చేస్తుంటే అనంత్ అంబానీ,అనిల్ కపూర్,రణవీర్ సింగ్..అక్కడ ఉన్న పలువురితో కలిసి డ్యాన్స్ వేశారు.స్టార్ హీరోయిన్ మాధురీదీక్షిత్‌ చోళీ కే పీచే పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ వేడుకలన్నీ బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లోనే జరిగాయి.

click me!

Recommended Stories