Ram Charan:ఎయిర్‌పోర్ట్ లో రామ్‌చరణ్‌ సందడి.. స్టయిలీష్‌ లుక్‌లో ఫిదా..టీషర్ట్ ధర వింటే ఫీజులెగిరిపోవాల్సిందే

Published : Nov 12, 2021, 04:43 PM IST

మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. ఎయిర్‌ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఈ `ఆర్ఆర్‌ఆర్‌` స్టార్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు రామ్‌చరణ్‌. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

PREV
17
Ram Charan:ఎయిర్‌పోర్ట్ లో రామ్‌చరణ్‌ సందడి.. స్టయిలీష్‌ లుక్‌లో ఫిదా..టీషర్ట్ ధర వింటే ఫీజులెగిరిపోవాల్సిందే

రామ్‌చరణ్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌ కి రెడీ అవుతుంది. మరోవైపు శంకర్‌తో `ఆర్‌సీ15` సినిమా చేస్తున్నాడు రామ్‌చరణ్‌. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దుబాయ్‌ నుంచి వస్తూ మీడియా కంటపడ్డాడు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్ లో కెమెరాలకు చిక్కాడు రామ్‌చరణ్‌. దీంతో క్లిక్‌మనిపించాడు. ఇందులో రాయల్‌ బ్లూ టీషర్ట్ లో అదరగొడుతున్నాడు రామ్‌చరణ్‌. అందరి చూపులను తనవైపు తిప్పుకున్నారు. స్టయిలీస్‌ గ్లాసెస్‌, బ్లాక్‌ ప్యాంట్‌, వైట్‌ షూట్‌తో, మాస్క్ ధరించి స్టయిల్‌గా నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉన్న ఈ పిక్స్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాయి. Ram Charan in airport.

27

రామ్‌చరణ్‌ స్టయిలీష్‌ నడకకి, ఆయన గెటప్‌కి ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ పిక్స్ ని వరుసగా షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు. దీంతో నెట్టింట చరణ్‌ లేటెస్ట్ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు ఈ సందర్భంగా రామ్‌చరణ్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయలు వెల్లడయ్యాయి. 
 

37

ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌ చరణ్‌ వేసుకున్న రాయల్‌ బ్లూ టీషర్ట్ ఇప్పుడు మరింత వైరల్‌ అవుతుంది. మరీ ముఖ్యంగా ఆ టీ షర్ట్ రేట్‌ మరింత ట్రెండ్‌ అవుతుంది. అయితే దాని రేట్‌ తెలిస్తే మాత్రం అంతా షాక్‌ అవ్వాల్సిందే. నోరెళ్ల బెట్టడం చూసినోళ్ల వంతవుతుంది. 
 

47

రామ్‌చరణ్‌ ధరించిన టీషర్‌ `గుస్సీ` కంపెనీకి చెందినది కావడం విశేషం. దానిపై స్నేక్‌ స్టాంప్‌ గ్రాఫిక్‌, క్య్రూనెక్‌ కలిగి ఉంది. దీని ధర మాత్రం 890 డాలర్లుగా తెలుస్తుంది. అంటే అక్షరాల 66వేలు కావడం విశేషం. కేవలం టీ షర్ట్ ఖరీదే ఇంత అనే విషయం ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ధర తెలుసుకున్న వాళ్లంతా నోరెళ్ల బెట్టడం విశేషం. వింటర్‌ స్టార్‌ అయిన నేపథ్యంలో చరణ్‌ ఈ ఖరీదైన టీషర్ట్ ధరించినట్టు తెలుస్తుంది. 

57

ఇటీవల శంకర్‌తో చేస్తున్న `ఆర్‌సీ15` చిత్ర ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నారు రామ్‌చరణ్‌. మరో షెడ్యూల్‌ ప్రారంభమయ్యే లోపు షార్ట్ ట్రిప్‌ప్లాన్‌ చేశాడు. దుబాయ్‌ చెక్కేశాడు. వెకేషన్‌ ట్రిప్ అని తెలుస్తుంది. అయితే వెంట భార్య లేకపోవడం ఇందులో నిజమెంతా అనేది సస్పెన్స్ గా మారింది. మొత్తంగా దుబయ్‌ నుంచి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు చరణ్‌. 

67

రామ్‌చరణ్‌ ప్రస్తుతం నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌` పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇది సంక్రాంతి కనుకగా జనవరి 7న విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్‌ మరో హీరోగా నటిస్తుండగా, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ పాత్రని పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మరోవైపు `నాటు నాటు` అంటూ సాంగే పాట దుమ్మురేపుతుంది. మ్యూజిక్‌ కంటే ఎన్టీఆర్‌, చరణ్‌ల డాన్సు అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. 

77

మరోవైపు చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దిల్‌రాజ్‌ ఈ సినిమాని పాన్‌ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. త్వరలో మరో షెడ్యూల్‌కి రెడీ అవుతుంది. 

also read: 'ఆర్ ఆర్ ఆర్' స్పెషల్ ప్రీమియర్ ఆల్రెడీ వేసారట
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories