Rajavikramarka review: రాజావిక్రమార్క మూవీ రివ్యూ

First Published Nov 12, 2021, 3:42 PM IST

ఒక్క హిట్ అంటూ భిన్నమైన జోనర్స్ లో సినిమాలు చేస్తూ, అదృష్టం పరీక్షించుకుంటున్నాడు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya gummakonda), హీరోగా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న కార్తికేయకు,  ఆర్ ఎక్స్ 100 రేంజ్ హిట్ అయితే మరలా దక్కలేదు. ఈ సారి ఎన్ఐఏ ఏజెంట్ గా.. యాక్షన్ ఎంటర్టైనర్  ఎంచుకున్నాడు. మరి ఈ మూవీ అయినా ఆయనకు విజయం అందించిందా... 
 

కథ: ఎన్ ఐ ఏ ఏజెంట్ అయిన రాజావిక్రమార్క( కార్తికేయ) హోమ్ మినిస్టర్ చంద్రశేఖర్(సాయి కుమార్) ని కాపాడే మిషన్ పై వస్తాడు. మినిస్టర్ కి సంఘ వ్యతిరేక శక్తుల నుండి ప్రమాదం  ఉన్న నేపథ్యంలో కార్తికేయ, అతన్ని రక్షించే బాధ్యత తీసుకుంటాడు. ఈ క్రమంలో మినిస్టర్ కూతురు కాంతి(తాన్యా రవిచంద్రన్) ప్రేమలో పడతాడు. అనూహ్యంగా మినిస్టర్ బదులు కాంతి కిడ్నాప్ అవుతుంది. అసలు కాంతిని కిడ్నాప్ చేసింది ఎవరు? రాజావిక్రమార్క తన ప్రేయసి, హోమ్ మినిస్టర్ కూతురైన కాంతిని కాపాడుకున్నాడా? అనేది మిగతా కథ 

ఎన్ ఐ ఏ ఏజెంట్ గా కార్తికేయ లుక్, బాడీ లాంగ్వేజ్ చక్కగా సెట్ అయ్యాయి. వెల్ టోన్డ్ బాడీలో కార్తికేయ హ్యాండ్సమ్ ఏజెంట్ గా అలరించారు. కామెడీ టైమింగ్, యాక్షన్, రొమాన్స్ అంశాల్లో కార్తికేయ నటన మెప్పించింది. మినిస్టర్ గా సాయి కుమార్, నెగిటివ్  చేసిన పశుపతి సినిమా మంచి నటన కనబరిచారు. హీరోయిన్ తాన్యా గ్లామర్ పర్వాలేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కీలకమైన పోలీస్ పాత్రలో అలరించారు. 

రాజావిక్రమార్క (Rajavikramarka) చిత్రం కామెడీ, యాక్షన్, రొమాన్స్ అంశాలు కలగలిపి ఫర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా మలచాలని దర్శకుడు శ్రీ సరిపల్లి (Sri saripalli) ప్రయత్నం చేశారు. అలాగే అనేక అనేక హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో తెరకెక్కించినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. 

అయితే ఏజెంట్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు బలమైన స్క్రీన్ ప్లే అవసరం. అలాగే నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉండాలి. ఆ విషయంలో రాజావిక్రమార్క ఫెయిల్ అయ్యింది. నూతన దర్శకుడు కథ, కథనాలు ఆసక్తికరంగా మలచడంలో ఫెయిల్ అయ్యారు. మూవీలో లాజిక్ లేని సన్నివేశాలు అనేకం. చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు సిల్లీగా తోస్తాయి. యాక్షన్ , కామెడీ, రొమాన్స్... ఈ మూడు కమర్షియల్ అంశాలలో ఒక్కటిగా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. 

తక్కువ బడ్జెట్ తో ఈ తరహా సినిమాల ఆకట్టుకునేలా మలచాలంటే టైట్ స్క్రీన్ ప్లే చాలా అవసరం. ఆసక్తిగొలిపే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఈ చిత్రంలో ఎక్కడా కనిపించవు. 

మ్యూజిక్ డైరెక్టర్ బీజీఎమ్ తో పాటు నటుడు హర్ష కామెడీ, తనికెళ్ళ భరణి డైలాగ్స్... కార్తికేయ నటన తర్వాత రాజా విక్రమార్క మూవీలో చెప్పుకోదగ్గ అంశాలు. ఇంతటి సీరియస్ స్టోరీలో విలన్ తన మార్కు చూపించకపోవడం, ప్రేక్షకులపై ఎటువంటి ప్రభావం చూపించడు. 

ఏజెంట్ కథలో తెరకెక్కే యాక్షన్ చిత్రాలు విజయం సాధించడం చాలా అరుదు. వరుస పరాజయాలతో ఉన్న కార్తికేయ ఈ జోనర్ ఎంచుకోవడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. సాదాసీదా నిర్మాణ విలువలతో ప్రేక్షకులను మెప్పించలేమని మరోమారు రుజువైంది. కార్తికేయ హిట్ కోరిక రాజమార్క తీర్చే అవకాశమే లేదు. ఆయన నెక్స్ట్ మూవీపై ఆశ పెట్టుకోవాల్సిందే. 
 

ఫైనల్ థాట్ 
మొత్తంగా రాజావిక్రమార్క పరాక్రమం చూపించలేకపోయాడు. 

Rating 2.25/5
నటీనటులు - కార్తికేయ, తాన్య, తనికెళ్ల భరణి

దర్శకుడు - శ్రీ సరిపల్లి

నిర్మాత - రామారెడ్డి

బ్యానర్ - శ్రీ చిత్ర మూవీ మేకర్స్

సంగీతం - ప్రశాంత్

Also read 'పుష్పక విమానం' మూవీ రివ్యూ

Also read Raja Vikramarka review: కార్తికేయ `రాజా విక్రమార్క` యూఎస్‌ ప్రీమియర్ షో రివ్యూ

click me!