రానా వల్లే చదువుకోలేకపోయా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..?

First Published | Aug 20, 2024, 2:45 PM IST

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను రానా దగ్గుబాటి చదువుకోనీయ్యకుండా చేశాడా..?  అతని వల్లే చరణ్ కు తక్కువ మార్కులు వచ్చాయా..? రామ్ చరణ్ వెల్లడించిన రహస్యం ఏంటి..? 

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్  , రానా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే..అంతే కాదు వీళ్లిద్దరు క్లాస్ మెంట్స్ కూడా, ఇద్దరు కలిసి ఒకే స్కూల్ లో.. ఒకే క్లాస్ చదివారు. ఇక వీరు ఇద్దరు  క్లాస్ మేట్స్ అనే విషయం చాలామంది ఫ్యాన్స్ కు ముందే తెలుసు. ఇక చాలా సందర్భాల్లో వీరిద్దరు తమ స్నేహం గురించి.. తాము చేసిన తుంటరి పనుల గురించి చెప్పుకున్నారు. వీరితో పాటు యంగ్ హీరో శర్వానంద్ కూడా వీరి బ్యాచ్ లో ఉన్నారు. 
 

All So Read: మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఆ సినిమాల్లో ఈ హీరోలకు టెంపర్ ఎక్కువ...

కొన్ని కొన్ని సందర్భాల్లో వీరిద్దురు సరదాగా ర్యాగింగ్ చేసుకుంటూ.. టీజ్ చేసుకున్నారు కూడా. తమ స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటూ.. ఒకరి సీక్రేట్ మరొకరు వెల్లడించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో రానా గురించి రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రానా వల్ల తన చదువుకు కలిగిన ఇబ్బందులు గురించి చరణ్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇంతకీ రానా గురించి చరణ్ ఏమన్నాడో తెలుసా..? 

All So Read: మహేష్ బాబు సహా.. 12 మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య..


Ram charan - Rana

రానా వల్ల చరణ్ కు చాలా తక్కువ మార్కులు వచ్చాయట. రామ్ చరణ్ మాట్లాడుతూ 8క్లాస్ నుంచి  నుంచి నేను రానా కలిసి చదువుకున్నాము.. అయితే అప్పటి వరకూ నాకు బాగానే మార్కులు వచ్చేవి కాని.. ఆతరువాత మార్కులు తగ్గాయి. అయితే అన్ని మార్కులు తగ్గడానికి రానానే కారణం అన్నారు చరణ్.  నాకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని అడిగితే రానా నా ముందు కూర్చుంటే బోర్డ్ ఏం కనిపిస్తుందని అని చెప్పేవాడినని చరణ్ అన్నారు.

All So Read: 45 నిమిషాల్లో 9 పాటలు ట్యూన్ చేసిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

అంతే కాదు రానా నా క్యారేజ్ కూడా తినేవాడు. నాదే కాదు..ఫ్రెండ్స్ లో చాలామంది క్యారేజ్ ను కూడా రానా తినేసేవాడు. అన్నారు చరణ్. కాని రానా మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి.. ఆయన..  నా ఫ్రెండ్ అయినందుకు  గర్వపడుతున్నానని రామ్ చరణ్ తెలిపారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో చరణ్  ఈ విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. 

All So Read: ఇండియాలో చిట్టి చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలివే..?

ఇక క్లాస్ మెంట్స్ అయిన ఈ ఇద్దరు హీరోలు ఫిల్మక ఇంస్ట్రీలో కూడా సహచరులుగా మారారు. హీరోలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు వీరు. రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా మారారు. గేమ్ ఛేంజర్ తో ఫ్యాన్స్ ను అలరించబోతున్నారు. ఆతరువాత  బుచ్చిబాబు సాన సినిమాలో జాయిన్ కాబోతున్నారు. ఇటు  రానా దగ్గుబాటి హీరోగా రాణిస్తూ.. ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో రజినీకాంత్ సినిమాలో నటిస్తున్నాడు రానా. 

Latest Videos

click me!