ఇక ఈ ఆగస్ట్ నెల స్టూడెంట్స్ కు పండగ నెల అనుకోవచ్చు. ఈనెలలో వరుసగా సెలవులు రావడంతో దిల్ ఖుష్ అవుతున్నారు విద్యార్థులు. ఇప్పటికే ఈనెలలో వరుసగా 5 రోజుల సెలవులు వచ్చాయి. ఆగస్టు 15 నుంచి.. 19 వరకు వరుసగా సెలవులు రావడంతో.. స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేశారు. వరుసగా పండగలు రావడంతో ఈ రోజుల్లో ఫ్యామిలీతో సరదాగా గడిపేశారు విద్యార్ధులు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, 16, వరలక్ష్మి వ్రతం, 17 శనివారం, 18 ఆదివారం, 19 రాఖీ పండుగ రావడంతో.. వరుసగా సెలవులు వచ్చాయి.
All So Read: ఇండియాలో చిట్టి చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలివే..?