జాన్వీ కపూర్ తో రాఖీ కట్టించుకున్న అభిమాని... తర్వాత అతడు చేసిన పనికి దేవర హీరోయిన్ పరార్!

Published : Aug 20, 2024, 02:12 PM ISTUpdated : Aug 20, 2024, 02:14 PM IST

హీరోయిన్ జాన్వీ కపూర్ కి ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. ఆమెతో రాఖీ కట్టించుకున్నాడు. అనంతరం అతడు చేసిన పనికి జాన్వీ కపూర్ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది...   

PREV
15
జాన్వీ కపూర్ తో రాఖీ కట్టించుకున్న అభిమాని... తర్వాత అతడు చేసిన పనికి దేవర హీరోయిన్ పరార్!
Janhvi Kapoor

హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ. ఆమె చేతిలో భారీ చిత్రాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ లో సౌత్ లో జెండా పాతే సూచనలు కనిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం ఓ స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసింది. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ దేవర చిత్రంలో జతకట్టిన సంగతి తెలిసిందే. 

25
Janhvi Kapoor

దేవర చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దేవర మొదటి భాగం విడుదలకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 థియేటర్స్ లోకి రానుంది. దేవర విజయం సాధిస్తే జాన్వీ కపూర్ దశ తిరిగినట్లే. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా అవతరించగలదు. 

 

35
Janhvi Kapoor

ఇక దేవర విడుదల కాకుండానే జాన్వీ మరో స్టార్ రామ్ చరణ్ సరసన ఛాన్స్ అందుకుంది. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించనున్న ఆర్సీ 16లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. పూజా కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

45
Janhvi Kapoor

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఆడియన్స్ ని తన నటనతో మెప్పించే సూచనలు కలవు. ఇదిలా ఉంటే రాఖీ పౌర్ణమి నాడు జాన్వీ కపూర్ కి వింత అనుభవం ఎదురైంది. ఓ స్టూడియో వద్ద ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. ఫోటోగ్రాఫర్స్ కి స్టిల్స్ ఇచ్చింది జాన్వీ కపూర్. 


 

55
Janhvi Kapoor

అయితే ఓ అభిమాని రాఖీతో జాన్వీ కపూర్ వద్దకు వెళ్ళాడు. తనకు రాఖీ కట్టాలని జాన్వీ కపూర్ ని కోరాడు. అభిమాని కోరిక మేరకు జాన్వీ కపూర్ రాఖీ కట్టింది. అనంతరం ఆ అభిమాని జేబులో నుంచి డబ్బులు తీసి జాన్వీకి ఇవ్వబోయాడు. ఊహించని ఆ పరిణామానికి జాన్వీ షాక్ అయ్యింది. అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయింది.. 

Read more Photos on
click me!

Recommended Stories