గేమ్ ఛేంజర్ బడ్జెట్
400 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమా నిర్మించారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లు. సినిమా రిలీజ్ కు ముందు భారీ ఎత్తున ప్రమోషన్ కూడా నిర్వహించారు మూవీ టీమ్. అందులో భాగంగా రామ్ చరణ్ కు సబంధించిన కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.
Also Read: నయనతారపై ధనుష్ 10 కోట్ల దావా కేసు.. కోర్టు సంచలన తీర్పు..?
రామ్ చరణ్ ఇష్టమైన హీరోయిన్
బాలకృష్ణ, రామ్ చరణ్ ని ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడిగి ఆలియా భట్, కియారా అద్వానీ, సమంతా అనే ఆప్షన్స్ ఇచ్చారు. రామ్ చరణ్ సమంత పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సమంత రామ్ చరణ్ కి ఇష్టమైన నటి
2018 లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్, సమంత నటించారు. ఈ సినిమాలో వీరి నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. 'గేమ్ ఛేంజర్' తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నారు.