Vishal
తెలుగు తమిళ భాషల్లో విశాల్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. పందెం కోడి చిత్రం విశాల్ కి మాస్ హీరోగా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో గుర్తింపు తీసుకువచ్చింది. కొన్నేళ్ల పాటు విశాల్ మాస్ చిత్రాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత విశాల్ కి వరుస పరాజయాలు ఎదురుకావడంతో మార్కెట్ పడిపోయింది. దీనితో రూటు మార్చిన విశాల్ థ్రిల్లర్ చిత్రాలపై దృష్టి పెట్టాడు. యాక్షన్, అభిమన్యుడు లాంటి చిత్రాలు సక్సెస్ ని తీసుకువచ్చాయి.
గత కొన్ని రోజులుగా విషయాలు ఆరోగ్యం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. మద గజ రాజా చిత్ర ఈవెంట్ లో విశాల్ వణికిపోతూ, కనీసం మైక్ పట్టుకుని మాట్లాడే స్థితిలో కూడా లేదు. వొళ్ళంతా వణికిపోతూ కనిపించాడు. బాగా సన్నబడిపోయాడు. దీనితో విశాల్ ని అలా చూసేసరికి అభిమానులు షాక్ అయ్యారు. విశాల్ ఆరోగ్యం గురించి వదంతులు వ్యాపించాయి. చివరికి వైద్యులు స్పందించి హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. విశాల్ హై ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం కోలుకుంటున్నారని, విశాల్ కి విశ్రాంతి అవసరం అని చెప్పారు. విశాల్ ఆరోగ్యం గురించి తాజాగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ స్పందించారు. ఆమె భర్త సుందర్ దర్శకత్వంలోనే విశాల్ మదగజ రాజా చిత్రంలో నటించారు. విశాల్ ఆరోగ్యం గురించి అనేక వదంతులు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఖుష్బూ నోరు విప్పారు.
విశాల్ కొన్ని రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాడు అని కుష్బూ తెలిపారు. అందుకే బాడీ బాగా వీక్ అయిపోయింది. ప్రస్తుతం ఫీవర్ తగ్గిపోయింది అని ఖుష్బూ తెలిపారు. తన హెల్త్ బాగా లేనప్పటికీ తన చిత్రాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మద గజ రాజా ఈవెంట్ కి హాజరయ్యాడట. విశాల్ 103 డిగ్రీల ఫీవర్ తో బాధపడ్డారట. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం విశాల్ బాడీ వీక్ గా ఉన్నప్పటికీ త్వరలో కోలుకుంటాడని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖుష్బూ అన్నారు.