రామ్ చరణ్ పెద్ది కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్..వచ్చే నెలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న ఈ మూవి ప్రీరిలీజ్ ను ఎక్కడ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధి ఎవరో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ది పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన తరువాత ఫైనల్ గా.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సబంధించిన ప్రమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పహిల్వాన్ గెటప్ లో రామ్ చరణ్ ను చూసి అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ పాట రిలీజ్ అయ్యి క్రేజ్ మరింత పెరిగింది.
25
చికిరి పాటకు భారీ స్థాయిలో స్పందన..
చికిరి చికిరి’ పాట చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో కేవలం తెలుగు వెర్షన్‌కే 200 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇటీవల కాలంలో ఒక స్టార్ హీరో సినిమాకు చెందిన పాట ఈ స్థాయి వ్యూస్ సాధించడం అరుదైన విషయం. ఇక సినిమా రిలీజ్ మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండగా.. నెక్ట్స్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ నుంచి పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో అభిమానుల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.
35
పెద్ది థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడంటే?
ఈ నేపథ్యంలో తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పెద్ది సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మే 16న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ ట్రైలర్ ఈవెంట్‌ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భోపాల్‌లో నిర్వహించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ చరణ్‌కు ధోనితో మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ గతంలో ఒక పెప్సీ ప్రకటనలో కలిసి కనిపించారు.ఈమధ్య కాలంలో కూడా వీరు కలిసి సందడి చేశారు. ఈసినిమాలో రామ్ చరణ్ రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న క్రికెటర్ గా కనిపించబోతున్నాడని టాక్. దాంతో రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్ కోసం ధోని వస్తున్నాడనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.
అంతేకాదు, ఈ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారనే వార్త కూడా హాట్ టాపిక్‌గా మారింది. రెహమాన్ ప్రత్యేకంగా లైవ్ కాన్సర్ట్స్ నిర్వహించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఒక సినిమా ఈవెంట్‌లో ఈ తరహా ప్రదర్శన ఇవ్వడం చాలా అరుదు.
55
బాలీవుడ్ లో భారీ స్థాయిలో..
నార్త్ ఇండియాలో ఇప్పటికే పుష్ప గట్టిగా పాతుకుపోయింది. దాంతో అక్కడ పెద్ది సినిమాకు కూడా అంతకు మించి హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈవిషయంలో ఇప్పటి వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.