హీరోయిన్లకు ఎవరిపై క్రష్ అని అడిగితే సిగ్గుపడతారు లేదా సైలెంట్ అయిపోతారు. కానీ సాయి పల్లవి అలా కాదు, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. తన కాలేజీ రోజుల నుంచే ఒక స్టార్ హీరో అంటే పిచ్చి ప్రేమ అని, ఆయనే తన ఫస్ట్ క్రష్ అని చెప్పేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకప్ లేకుండానే కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న అరుదైన నటి సాయి పల్లవి. ఆమె డ్యాన్స్‌కు ఫిదా కానివారు, ఆమె సహజ నటనకు పడిపోని వారు ఉండరు. 'ప్రేమమ్' సినిమాలో మలర్ టీచర్‌గా పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్‌లో 'సీత'గా మెరవడానికి సిద్ధమవుతోంది.
అయితే, ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న ఈ లేడీ పవర్ స్టార్‌కు చిన్నప్పటి నుంచి ఒక హీరోపై విపరీతమైన 'క్రష్' ఉండేదట! ఇంతకీ సాయి పల్లవి మనసు దోచిన ఆ హ్యాండ్సమ్ హీరో ఎవరో తెలుసా?
26
సాయి పల్లవి ఫస్ట్ క్రష్
సాధారణంగా హీరోయిన్లను మీ క్రష్ ఎవరని అడిగితే సిగ్గుపడతారు లేదా సమాధానం దాటవేస్తారు. కానీ సాయి పల్లవి అలా కాదు, ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పేస్తుంది. తన కాలేజీ రోజుల నుంచే ఒక స్టార్ హీరో అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఆ హీరో మరెవరో కాదు, కోలీవుడ్ 'సింగం', నటనకు మారుపేరైన సూర్య.
అవును, సాయి పల్లవి ఫస్ట్ క్రష్ సూర్యనే. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ, "నేను సూర్య గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ప్రతీ సినిమా చూసేదాన్ని. స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే చాలు, నా కళ్లు పక్కకు తిప్పేదాన్ని కాదు. ఆయన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం" అని సంతోషంగా చెప్పుకొచ్చింది.
36
సూర్యను ఆరాధించిన సాయి పల్లవి
ఒక సాధారణ అభిమానిగా సూర్యను ఆరాధించిన సాయి పల్లవికి, ఏకంగా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 'NGK' సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినప్పుడు ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. "నా డ్రీమ్ హీరోతో కలిసి నటించడం అనేది నిజంగా ఒక కల నిజమైన క్షణం లాంటిది" అని సాయి పల్లవి అంటుంది.
షూటింగ్ సెట్‌లో సూర్య క్రమశిక్షణ, సింప్లిసిటీ, తోటి నటీనటులకు ఆయన ఇచ్చే గౌరవం చూసి సాయి పల్లవి ఆశ్చర్యపోయిందట. కేవలం నటుడిగానే కాకుండా, ఒక వ్యక్తిగా సూర్యను చూశాక ఆయనపై ఉన్న గౌరవం, ప్రేమ వంద రెట్లు పెరిగాయని ఆమె గుర్తు చేసుకుంది.
56
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు
రీసెంట్ గా బర్త్ డే చేసుకున్న సాయి పల్లవికి సోషల్ మీడియాలో అభిమానులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె రణ్‌బీర్ కపూర్‌తో కలిసి 'రామాయణ' చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.
66
సూర్యపై సాయి పల్లవి క్రష్..
తన సహజమైన అందం, అద్భుతమైన డ్యాన్స్‌తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సాయి పల్లవి, తనకూ ఒక సాధారణ అభిమాని మనసు ఉందని నిరూపించుకుంది. సూర్యపై తనకున్న 'క్రష్' కథ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఇది చూసి అభిమానులు "మా సాయి పల్లవి కూడా మాలాంటిదే" అని సంబరపడిపోతున్నారు.