స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మొదట కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. వీరి ప్రేమ నిశ్చితార్థం వరకు వెళ్లి, ఆ తర్వాత సడెన్ గా వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. వీరు విడిపోవడానికి కారణం ఏంటి?
కన్నడ 'కిరిక్ పార్టీ'తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్నా. ఆతరువాత కాలంలో వరుస విజయాలతో టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా కొనసాగుతోన్న రష్మిక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆమె కొన్ని విషయాలు పరోక్షంగా చెప్పింది. అది తన బ్రేకప్ గురించా అనేది స్పష్టంగా తెలియడంలేదు.
24
రష్మిక మందన్న కామెంట్స్
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రష్మిక మాట్లాడుతూ.. '' ఒక అమ్మాయి ధైర్యంగా 'ఈ బంధం ఇష్టం లేదు' అని చెప్పినప్పుడు, అది అవతలి వ్యక్తికి షాక్ కావచ్చు. కానీ ఆమెకు కాదు. ఎందుకంటే ఆమె దృష్టిలో అది మొదటి నుంచి ఒక బంధమే కాదు'' అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
34
రష్మిక మనసులోని మాట
ఈ వీడియో వైరల్ అవ్వడంతో, ఇది రష్మిక మనసులోని మాట అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. రష్మిక అభిప్రాయానికి కొందరు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆమె కన్నడ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించించి, వీరి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కానీ పెళ్లికి ముందే వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ ఈ బంధం గురించేనా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఆమెకు ఈ బంధం నచ్చకనే విడిపోయిందంటున్నారు.
మరో ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. 'సరదాగా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఇష్టం. అందుకే విజయ్ దేవరకొండ అంటే ఇష్టం' అని చెప్పింది. అంటే, విజయ్‌లో ఉన్న ఆ గుణం రక్షిత్ శెట్టిలో లేదా? అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా. రష్మిక కామెంట్స్ మాత్రం వైరల్ అవుుతన్నాయి. ఇక రష్మిక, విజయ్ ఎప్పుడు తమ బంధం గురించి, పెళ్లి డేట్ గురించి అఫీషియల్ గా ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు.