మహేష్ బాబు, రాజమౌళి సినిమా టైటిల్ ముహూర్తం ఫిక్స్, భారీ ఈవెంట్ కు ప్లాన్ చేస్తోన్న జక్కన్న టీమ్

Published : Nov 01, 2025, 05:01 PM IST

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ మూవీ టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో మహేష్ బాబు 29వ సినిమాకు టైటిల్ ముహూర్తం ఫిక్స అయినట్టు తెలుస్తోంది.

PREV
14
పాన్ వరల్డ్ మూవీ..

సూపర్ స్టార్ మహేశ్ బాబు , దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోంది భారీమల్టీ స్టారర్ మూవీ. దాదాపు 1000 కోట్ల బడ్డెజ్ తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. కెన్యా లాంటి దేశాల్లో కీలక షెడ్యూల్స్ ను కంప్లీట్ చేశాడు జక్కన్న. ఈసినిమా అప్ డేట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్.. ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా త్వరలో జక్కన్న టీమ్ నుంచి అభిమానులకు శుభవార్త అందబోతున్నట్టు తెలుస్తోంది.

24
టైటిల్ ప్రకటనకు ముహూర్తం

మహేష్ బాబు, రాజమౌళి కాంబో మూవీ టైటిల్ పై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమా టైటిల్ ఇది అని ఊహాగానాలు కూడా లేవు. దాంతో రాజమౌలి ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు. ఈక్రమంలోనే ఈసినిమాకు సబంధించి కీలక అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నవిధంగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ టైటిల్ ను నవంబర్ 15న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన రాలేదు కానీ.. టాలీవుడ్ లో మాత్రం టాక్ గట్టిగా నడుస్తోంది.

34
భారీ ఈవెంట్ కు ప్లాన్ చేస్తోన్న జక్కన్న

అంతే కాదు ఈసినిమా టైటిల్ ప్రకటన కోసం భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి టీమ్. నవంబర్ 15న హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ ఈవెంట్‌లో భాగంగానే ఈ చిత్రానికి అధికారిక టైటిల్‌ను ప్రకటించి, ఓ పవర్‌ఫుల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం జక్కన్న టీమ్ ఇప్పటికే పని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

44
ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ

ఈ సినిమాలో మహేష్ బాబు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకు కూడా హాలీవుడ్ స్థాయి విజువల్ ట్రీట్ ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోందనే ప్రచారం కొనసాగుతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories