Peddi Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ, రామ్‌ చరణ్‌కి అసలు పరీక్ష ఇదే..

Published : Jun 03, 2026, 09:16 AM IST

రామ్‌ చరణ్‌ నటించిన `పెద్ది` సినిమా మరికొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ మూవీకి ఫస్ట్ రివ్యూ ఏంటి? చూసిన వాళ్లు ఏం చెబుతున్నారనేది చూస్తే. 

PREV
14
గ్రాండ్‌ రిలీజ్‌కి పెద్ది రెడీ

రామ్‌ చరణ్‌ `ఆచార్య`, `గేమ్‌ ఛేంజర్‌` వంటి డిజాస్టర్ల తర్వాత ఇప్పుడు `పెద్ది` సినిమాతో వస్తున్నారు. ఈ రోజు రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్స్ తో రిలీజ్‌ కానుంది. ఆంధ్రాతోపాటు తెలంగాణలోనూ ప్రీమియర్స్ కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే టికెట్‌ రేట్లు కూడా పెంచింది. తెలంగాణలో ప్రీమియర్స్ కి  ఒక్క టికెట్‌ రూ.600గా నిర్ణయించింది. అలాగే రేపటి (జూన్‌ 4) నుంచి సింగిల్‌ థియేటర్లలో వంద రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో 125 రూపాయలు పెంచింది. గ్రాండ్‌ రిలీజ్‌కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే మూవీకి సంబంధించి హైదరాబాద్‌లో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ ప్రెస్‌ మీట్‌ వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సినిమా రిలీజ్‌కి కొన్ని గంటలే ఉండటంతో అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మరి మూవీ ఎలా ఉండబోతుంది, టీమ్‌ ఏం చెబుతుంది? క్రిటిక్స్ ఏమంటున్నారు? ఇప్పటికే కొన్ని షోస్‌ ప్రదర్శించిన నేపథ్యంలో ఫస్ట్ టాక్‌ ఎలా ఉందనేది చూస్తే,

24
స్పోర్డ్స్ నేపథ్యంలో సాగే విలేజ్‌ ఎమోషనల్‌ డ్రామా పెద్ది

రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. శివ రాజ్‌ కుమార్‌, జగపతిబాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. స్పోర్డ్స్ నేపథ్యంలో సాగే విలేజ్‌ ఎమోషనల్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించారు. ఈ మూవీ ఒక ఆటగాడి జర్నీని చూపిస్తుందట. తన ప్రాంతం కోసం ఆయన చేసే పోరాటం ప్రధానంగా సినిమా సాగుతుందట. ఆట ఆ వ్యక్తికి గుర్తింపుని, తమ ప్రాంతానికి గుర్తింపుని తీసుకొస్తుందని, ఎంతో మందిని బయట ప్రపంచానికి పరిచయం చేస్తుందని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. సినిమా మెయిన్‌గా ఎమోషనల్‌ డ్రామాగా సాగుతుందని చెప్పారు. రామ్‌ చరణ్‌ పాత్ర అదిరిపోతుందని, ఆయన పాత్రకి ఫిదా అవుతారని చెప్పారు.

34
పెద్ది ఫస్ట్ రివ్యూ

`పెద్ది` సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికేట్‌ని పొందింది. సినిమా మూడు గంటల రెండు నిమిషాల నిడివితో ఉండబోతుంది. ఈ మూవీని బయ్యర్లకి ఇప్పటికే చూపించారు మైత్రీ మూవీ మేకర్స్. వాళ్లు ఈ మూవీని రిలీజ్‌ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది బయ్యర్లు ఈ సినిమాని చూశారట. చూసిన ప్రతి ఒక్కరు బ్లాక్‌ బస్టర్‌ రిపోర్ట్ ఇచ్చారని, రామ్‌ చరణ్‌ కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా అవుతుందని, రికార్డులన్నింటికి తిరగరాసే మూవీ అవుతుందని నిర్మాత రవి శంకర్‌ తెలిపారు. టీమ్‌ నుంచి గట్టి నమ్మకం వినిపిస్తోంది. శివ రాజ్‌ కుమార్‌ అయితే రామ్‌ చరణ్‌కి ఏకంగా జాతీయ అవార్డు వస్తుందన్నారు. ఇలా టీమ్‌ మాత్రం ప్రమోషన్స్ లో హైప్‌ని పెంచే ప్రయత్నం చేశారు. కానీ బజ్‌ మాత్రం రావడం లేదు. ట్రైలర్‌ ఆకట్టుకోలేకపోవడంతో ఆ స్థాయిలో బజ్‌ లేదు. రిలీజ్‌ తర్వాత వచ్చే టాక్‌తోనే ఈమూవీ సక్సెస్‌ ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

44
పెద్దికి షాకింగ్‌ రిపోర్ట్

ఇదిలా ఉంటే ఓవర్సీస్‌ క్రిటిక్‌గా భావించే ఉమైర్‌ సందు ఈ మూవీపై తన రివ్యూని ఇచ్చాడు. షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. సింపుల్‌గా సినిమా డిజాస్టర్‌ అని తేల్చేశాడు. బోరింగ్‌గా సినిమా సాగుతుందని, ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని అన్నాడు. ఇదొక లేజీ బోరింగ్‌, మాస్‌ ఎంటర్టైనర్‌ మూవీ అని తెలిపారు. కొత్త సీసాలో పాత సారా లాంటి మూవీ అన్నాడు. ఇదొక పూర్ ఫిల్మ్ అని, రామ్‌ చరణ్‌ పర్‌ఫెర్మెన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదన్నాడు. అయితే ఈయన చెప్పే రివ్యూలు ఏవీ కరెక్ట్ గా ఫలితాన్నివ్వలేదు. కానీ చాలా వరకు నెగటివ్‌ పోస్ట్ లతో రచ్చ చేస్తుంటాడు. ఇలా సినిమాకి సంబంధించి ఎవరికి వరకు తమకు నచ్చినట్టు చెబుతున్నారు. కానీ అసలు మూవీ ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఏసియానెట్‌ తెలుగు అందించే ఒరిజినల్‌ రివ్యూ కోసం వేచి చూడండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories