ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‌కు 'నువ్వు నేను' సినిమాలో ఛాన్స్.. కుండబద్దలు కొట్టిన తేజ

Published : Jan 20, 2026, 07:38 PM IST

Director Teja: దర్శకుడు తేజ చిత్రం సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. అలాగే ఉదయ్ కిరణ్‌తో తన అనుబంధాన్ని పంచుకున్నారు. దాసరి నారాయణరావు లాంటి దిగ్గజం లేని లోటు ప్రస్తుత ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుందని వివరించారు. 

PREV
15
ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు..

దర్శకుడు తేజ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ శాశ్వతమని ఏది లేదని, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, సావిత్రి లాంటి దిగ్గజాలు లేకపోయినా ఇండస్ట్రీ నిలబడిందని, ముందుకు సాగిందని వివరించారు.

25
చిత్రం సినిమాతో డైరెక్టర్ గా

తేజ దర్శకుడిగా పరిచయం అయింది చిత్రం సినిమా ద్వారా.. మొదట వేరే హీరో అనుకున్నా, చివరికి ఉదయ్ కిరణ్ హీరోగా ఖరారయ్యాడని తెలిపారు. ఉదయ్ కిరణ్ అమాయకుడు, మంచివాడని, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడని పేర్కొన్నారు. 30 రోజుల్లో సినిమా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సరిగ్గా 31 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు.

35
నువ్వు నేను హీరోయిన్ ఎంపిక

నువ్వు నేను సినిమా విషయానికి వస్తే, మాధవన్‌ను అనుకున్నా, అతను తెలుగు సినిమాలు చేయనని చెప్పడంతో ఉదయ్ కిరణ్‌ను హీరోగా తీసుకున్నట్లు తేజ వెల్లడించారు. హీరోయిన్ ఎంపికలో ఒక డిమాండ్ చేసే అమ్మాయిని కాదని, ప్రేమ గుడ్డిది. అందం, గిందం, కులం, గోత్రం ఏమీ చూడదు అనే డైలాగ్ ద్వారా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలిపారు. నటనతో ప్రజలను కదిలించడమే ముఖ్యం తప్ప, అందం కాదని తేజ స్పష్టం చేశారు.

45
సంగీతం, సాహిత్యంపై తేజ అభిప్రాయం

తన సినిమాలు, పాటలు ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని తేజ చెప్పారు. చెన్నైలో పెరిగినందున తనకు తెలుగులో పెద్ద పెద్ద పదాలు రావని, అందుకే తన సినిమాల్లో సాధారణ, తెలుగు పదాలు ఎక్కువగా ఉంటాయని, ఇంగ్లీష్ తక్కువగా ఉంటుందని వివరించారు. తన ప్రేక్షకులు రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, యువత, మధ్యతరగతి ప్రజలేనని, వారికి అర్థమయ్యే భాషలో సినిమాలు తీయడమే తన లక్ష్యమని తేజ పేర్కొన్నారు.

55
తేజ కెరీర్..

రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి శివ, క్షణక్షణం వంటి చిత్రాలకు పనిచేశానని, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మనే తనను కెమెరామెన్‌గా మార్చారని తేజ తెలిపారు. రాత్రి, అంతం, మనీ, రక్షణ, తీర్పు వంటి తెలుగు చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశాక ముంబై వెళ్లిపోయానని, అక్కడ హిందీ సినిమాలకు కథలు అందించానని, ఆ తర్వాత దర్శకుడిగా మారి 'చిత్రం' మూవీతో.. స్వయంగా నిర్మాతగా మారి జయం, నిజం వంటి విజవంతమైన చిత్రాలను నిర్మించానని తేజ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories