సెప్టెంబర్ 27 2007లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. చరణ్ కి మంచి ఎంట్రీగా నిలిచింది. మాస్ ఎలిమెంట్లు, యాక్షన్ సీన్లు, లవ్, గ్లామర్, ఇలా అన్ని కమర్షియల్ హంగులు జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. అదే స్థాయిలో ఆకట్టుకుంది. మరి రామ్ చరణ్ మొదటి పారితోషికం ఏం చేశాడు? ఎంత తీసుకున్నాడనేది ఆసక్తికరం.
ఈ మూవీకి అశ్వినీదత్ హీరో చరణ్‌కి రూ.50లక్షలు పారితోషికంగా ఇచ్చాడట. అయితే చిరంజీవి తరఫు నుంచి ఎలాంటి డిమాండ్ లేదు. చరణ్ కూడా పారితోషికం అడగలేదు. నిర్మాత తానే స్వతహాగా నిర్ణయం తీసుకుని పారితోషికం ఇచ్చాడట.