మరి ఆ సంచలన స్టార్ ఎవరో కాదు ఉదయ్ కిరణ్. అవును `చిత్రం`, `నువ్వు నేను`, `మనసంతా నువ్వే`, `కలుసుకోవాలని` వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకుని సంచలనంగా మారారు ఉదయ్ కిరణ్. అప్పట్లో యంగ్ హీరోల్లో ఆయనో సునామీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇండస్ట్రీలోనే కాదు ఆడియెన్స్ పరంగా ఆయనకు వచ్చి ఇమేజ్, క్రేజ్ మామూలు కాదు. అమ్మాయిలు అయితే పడిచచ్చేవాళ్లు. ఇలాంటి లవర్ మాకు దొరకాలని భావించేవాళ్లు. ఎంతో మందికి డ్రీమ్ బాయ్‌గా నిలిచారు ఉదయ్ కిరణ్. ఆయన క్రేజ్‌ని చూసి పెద్ద స్టార్స్ సైతం షాక్ అయిన పరిస్థితి. చాలా మందికి మనశ్శాంతి లేకుండా చేసిన హీరో ఉదయ్ కిరణ్. పవన్ కళ్యాణ్ కి ఆయన పోటీగా భావించారు.