24 ఏళ్ల ఈ అమ్మాయి మొదట కన్నడ సినిమాలతో పరిచయమయ్యారు. సినిమాపై ఇష్టంతో 20 ఏళ్లకే ముగిల్ పేట అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇది పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. చిన్న వయసులోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టి, కన్నడ తర్వాత మలయాళం, మరాఠీ సినిమాల్లో నటించి ఇప్పుడు తమిళంలో పరిచయమయ్యారు. ఈమె నటించిన డ్రాగన్ సినిమా గత నెలలో విడుదలైంది.