మరి రామ్ చరణ్ ఎక్కుగా ఆరాధించే నటుడు ఎవరు? నటన పరంగా ఎవరిని ఎక్కువగా అభిమానిస్తారనేది చూస్తే ఆయన ఎస్వీఆర్(ఎస్వీ రంగారావు)ని అభిమానిస్తారట. ఆయన నటన అన్నా, ఆయన ఆహార్యం అన్నా,
డైలాగ్ డెలివరీ అన్నా, పాత్రలో జీవించే తీరు అన్నా, మొత్తంగా ఆయన నట విశ్వరూపం అన్నా తనకు బాగా నచ్చుతాయని, ఆయనే తన అభిమాన నటుడు అని తెలిపారు రామ్ చరణ్. `మగధీర` సినిమా సమయంలో రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.