Oka Pathakam Prakaaram Movie Review: `ఒక పథకం ప్రకారం` మూవీ రివ్యూ

Published : Feb 07, 2025, 08:22 PM IST

పూరీ జగన్నాథ్‌ తమ్ముడు సాయి రామ్‌ శంకర్‌ హీరోగా నటించిన మూవీ `ఒక పథకం ప్రకారం`. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
Oka Pathakam Prakaaram Movie Review: `ఒక పథకం ప్రకారం` మూవీ రివ్యూ

స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తమ్ముడు సాయి రామ్‌ శంకర్‌ హీరోగా కనిపించి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు కొంత గ్యాప్‌తో మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లర్‌ మూవీ `ఒక పథకం ప్రకార` మూవీలో నటించారు. వినోద్‌ విజయన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ వినోద్‌ విహాన్‌ ఫిల్మ్స్, విహారి సినిమా హౌజ్‌ ప్రై లి పతాకంపై గార్లపాటి రమేష్‌, వినోదయ్‌ విజయన్‌ నిర్మించారు. శ్రీ లక్ష్మి ఫిల్మ్ పతాకంపై బాపిరాజు దీన్ని తెలుగు స్టేట్స్ లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 7న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

26

కథః 
సిద్ధార్థ్‌(సాయిరామ్‌ శంకర్‌) పబ్లిక్‌ ప్రాసిక్యూట్‌. ఓ కేసు వాధించలేక అపోజిట్‌ లాయర్‌పై జడ్జ్ ముందే దాడి చేయడంతో ఆయన్ని సస్పెండ్‌ చేస్తారు. తన భార్య సీత(ఆషిమా నర్వాల్‌) తప్పిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన సిద్దార్థ్‌ తాగుడుకి బానిస అవుతాడు. ఈ క్రమంలో వరుసగా ఆడవాళ్లు హత్యకు గురవుతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్‌ చేసే క్రమంలో ఆసక్తికర, సస్పెన్స్ అంశాలు చోటు చేసుకుంటాయి. ఈ కేసుని మొదట ఏసీపీ(సముద్రఖని) విచారించగా, లాయర్‌ సిద్ధార్థ్‌ నే దోషిగా క్రియేట్‌ చేసే క్రమంలో విఫలమవుతాడు. దీంతో ఈ కేసుని ఐపీఎస్‌ కవిత(శృతి సోధి) టేకప్‌ చేస్తుంది. సిద్దార్థ్‌ సహాయంతో కొన్ని క్లూస్‌ తెలుసుకుంటుంది. కానీ ఫైనల్‌గా వీళ్లు కూడా విఫలమవుతారు. అజయ్‌ అనే వ్యక్తిని దోషిగా గుర్తిస్తారు. కానీ అతను చనిపోయినట్టు పేరెంట్స్ చెప్పడంతో అంతా షాక్‌. మరి ఇంతకి ఈ హత్యలకు కారణం ఎవరు? దీనికి `సెక్షన్‌కి 361/2010` కేసుకి సంబంధం ఏంటి? మరి దీని వెనకాల ఉన్నది ఎవరు? అసలు హంతకుడెవరు? హంతకుడు ఎందుకు అలాచేయాల్సి వచ్చింది? సిద్ధార్థ్‌ భార్య సీత చనిపోయిందా? ఈ క్రమంలో చోటు చేసుకున్న సస్పెన్స్ అంశాలు, ట్విస్టు లు, టర్న్‌ల సమాహారమే ఈ మూవీ కథ. 
 

36

విశ్లేషణః 
ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి. ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేయడంలో చాలా వరకు సక్సెస్‌ అవుతున్నాయి. ఇలాంటి సినిమాలు చూడ్డానికి ఒకేలా ఉన్నా, రెండున్నర గంటలపాటు ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేయడంలో సక్సెస్‌ అయితే సినిమా సక్సెస్‌ అయినట్టే. ఇప్పుడు అలాంటి మర్డర్‌ మిస్టరీతో, సస్పెన్స్ అంశాలతో రూపొందిన మూవీనే `ఒక పథకం ప్రకారం`. ఆద్యంతం సస్పెన్స్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు. హీరో పాత్ర భార్య మిస్‌ కావడంతో మొదలైన ఈ స్టోరీ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా సాగినా, క్రమంగా ఊపందుకుంటుంది. ఆద్యంతం ఎంగేజ్‌ చేసేలా సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కాస్త రెగ్యూలర్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. ఓ వైపు కోర్ట్ లో వాదనలు, సాయి రామ్‌ శంకర్‌ పిచ్చి పిచ్చిగా వ్యవహారించడం, కేసులు వాధించడంలో విఫలం కావడంతో, ఆయన ఎందుకు బాధపడుతున్నాడో అర్థం కాదు. కానీ తన భార్య మిస్‌ కావడంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లడంతో కథ సీరియస్‌గా మారుతుంది. అయితే ఇలాంటి కథలో కూడా ఫన్‌ యాంగిల్‌ జోడించడం గొప్ప విషయం. ఏసీపీ సముద్రఖని పాత్రతో కామెడీ పుట్టించడం హైలైట్‌గా నిలిచింది. ఇంతటి సీరియస్‌ ఫిల్మ్ లో సముద్రఖని కూడా అంతే బాగా కామెడీ చేసి అలరించారు. ఆడియెన్స్ కి రిలీఫ్‌నిచ్చారు. 
 

46

ఇక రెండో భాగం తర్వాత కథ స్పీడందుకుంటుంది. రేసీగా సాగుతుంది. సాయి రామ్‌ శంకర్‌ ఇన్వెస్టిగేషన్‌లోకి దిగడంతో అసలు నేరస్థుడు ఎవరు అనేది కనిపెట్టే క్రమంలో ఇన్వెస్టిగేషన్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. సీట్‌ ఎడ్జ్ థ్రిల్లర్‌ ఎక్స్ పీరియెన్స్ ని అందిస్తుంటుంది. అయితే నేరస్థుడు అతనేమో, ఇతనేమో అనే ఫీలింగ్‌ ఆడియెన్స్ కి కలిగిస్తూ  కన్‌ఫ్యూజ్‌ చేస్తూ, కథనాన్ని తీసుకెళ్లిన తీరు అదిరిపోయింది. చివరి నిమిషం వరకు నేరస్థుడు ఎవరనేది సస్పెన్స్ క్రియేట్‌ చేసిన తీరు బాగుంది. అక్కడే మేకర్స్ సక్సెస్‌ అయ్యారు. క్లైమాక్స్ ని మాత్రం చాలా గ్రిప్పింగ్‌ గా రాసుకున్నారు. అది సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఫస్టాఫ్‌ కొంత నార్మల్‌గానే ఉన్నా, సెకండాఫ్‌, ముఖ్యంగా క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా ఊపందుకుంటుంది. ఆద్యంతం ఎంగేజ్‌ చేస్తూ థ్రిల్‌కి గురి చేస్తుంది. మంచి థ్రిల్ ఫీలింగ్‌నిస్తుంది. 
 

56

నటీనటులుః 
సిద్ధార్థ్‌ పాత్రలో సాయి రామ్‌శంకర్‌ బాగా నటించాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఓ సిన్సియర్‌ లాయర్‌గా, డిప్రెషన్‌లోకి వెళ్లిన వ్యక్తిగా, భార్యని కోల్పోయిన భర్తగా, ఇన్వెస్టిగేటివ్‌గా ఇలా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు. కాసేపు నెగటివ్‌ టచ్‌ ఇచ్చిన తీరూ బాగుంది. యాక్టింగ్‌ పరంగా మరోసారి మెప్పించాడు. కమ్‌ బ్యాక్‌ అనిపించుకున్నాడు. ఏసీపీగా సముద్రఖని పాత్ర ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సినిమాకి ఎంటర్‌టైనింగ్‌ పార్ట్ ఆయన పాత్రదే. అలాగే పోలీస్‌ ఆఫీసర్‌ కవితగా శృతి సోధి కూడా ఆకట్టుకుంది. అలరించింది. తన మార్క్ నటనతో మెప్పించింది. సిద్ధార్థ్‌ భార్య పాత్రలో అషిమా నర్వాల్‌ కాసేపు మెరిసినా మెస్మరైజ్‌ చేసింది. చాలా కాలం తర్వాత సుధాకర్‌ ఇందులో కనిపించి మెప్పించారు. అయితే ఆయన ఒకప్పటి లుక్‌లో కనిపించడం విశేషం. రవి పచ్చ ముత్తు చాలా కాలం తర్వాత మెరిశారు. తనదైన కామెడీతో నవ్వించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 
 

66

టెక్నీషియన్లుః 
రాజీవ్‌ రాయ్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. రాహుల్‌ రాజ్‌ సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యింది. పాటలు బాగున్నాయి. గోపీసుందర్‌ బీజీఎం అదిరిపోయింది. అదే సినిమాని ఎంగేజ్‌ చేసేలా చేస్తుంది. ఆడియెన్స్ ని హంట్‌ చేసింది. కార్తీక్‌ జోగేష్‌ ఎడిటింగ్‌ ఓకే అనిపించింది. కానీ ఇంకా ట్రిమ్‌ చేయోచ్చు. సిద్‌ శ్రీరామ్‌ పాటలు సినిమాకి అసెట్‌. దర్శకుడు వినోద్‌ కుమార్‌ విజయన్‌ దర్శకత్వం, స్క్రీన్‌ ప్లే పరంగా బాగా చేశాడు. తన బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. నిజాయితీతో సినిమాని తీశారు. అయితే ఫస్టాఫ్‌ని మరింత క్లారిటీగా చేయాల్సింది. చాలా సీన్లు కొంత రొటీన్‌ గా, సిద్ధార్థ్‌ పాత్రని మలిచిన తీరులో కొంత క్లారిటీ లేదు. ఆ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది. కానీ ఓవరాల్‌గా మాత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ ఎక్స్ పీరియెన్స్ ని అందించారు. 

ఫైనల్‌గాః మర్డర్‌ మిస్టరీ చుట్టూ సాగే సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియెన్స్ కి నచ్చే మూవీ అవుతుంది. 

రేటింగ్‌ః 2.5

Read More: `తండేల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories