'వెంట్రుకతో సమానం' అని రాంచరణ్ ఎందుకు అనాల్సివచ్చింది.. అసలేం జరిగింది ?

Published : Aug 29, 2025, 06:47 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాశం అయ్యాయి. ఇంతకీ రాంచరణ్ ఏమన్నారు ? ఎందుకు అలా అన్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన నాయక్ చిత్రం 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అది. కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటించారు. కథ రొటీన్ అయినప్పటికీ రాంచరణ్ ని వినాయక్ ప్రజెంట్ చేసిన విధానం, తమన్ సంగీతం.. బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి కామెడీ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. 

25

ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. నాయక్ ఆడియో లాంచ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాంచరణ్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన గత చిత్ర ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో కొందరు మెగా ఫ్యామిలీ లో విభేదాలు మొదలయ్యాయి అంటూ పుకార్లు సృష్టించారు. మీడియాలో రూమర్స్ వచ్చాయి. 

35

రాంచరణ్ మాట్లాడుతూ నేను నటించే అన్ని చిత్రాల ఆడియో ఫంక్షన్స్ కి కళ్యాణ్ బాబాయ్ రావడం కుదరదు. దానికి బోలెడు కారణాలు ఉంటాయి. కేవలం ఆడియో ఫంక్షన్ కి రాలేదని మా కుటుంబంలో వివాదాలు ఉన్నాయని రూమర్స్ క్రియేట్ చేయడం, అసత్య వార్తలు రాయడం తప్పు. ఒక వేళ అలా చేసినా నాకు వెంట్రుకతో సమానం అని రాంచరణ్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. 

45

రాంచరణ్ అంత ఎమోషనల్ గా, ఆగ్రహంగా మాట్లాడడం అప్పట్లో తెగ వైరల్ అయింది. అసలు రాంచరణ్ అంతలా బరస్ట్ కావడానికి కారణం ఉంది. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత రాంచరణ్ రచ్చ మూవీ రిలీజ్ అయింది. ఆ చిత్ర ఆడియో లాంచ్ కి పవన్ హాజరు కాలేదు. అప్పటి నుంచే పుకార్లు మొదలయ్యాయి. 

55

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది. తమ ఫ్యామిలీ గురించి వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేందుకు చిరంజీవి స్వయంగా గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా రూమర్స్ ఆగలేదు. అందువల్లే నాయక్ ఆడియో లాంచ్ లో చరణ్ ఆగ్రహంగా,ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రతిసారి ఒకే వేదికపై కనిపిస్తేనే తమ మధ్య ప్రేమ ఉన్నట్లు కాదని క్లారిటీ ఇచ్చారు. 

Read more Photos on
click me!

Recommended Stories