అక్కినేని నాగార్జున 1959 ఆగస్ట్ 29న జన్మించిన విషయం తెలిసిందే. నేడు(శుక్రవారం) ఆయన 66వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. మాస్ హీరోగా `విక్రమ్` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున `అఖరి పోరాటం`తో మెప్పించారు. `గీతాంజలి` చిత్రంతో మంచి బ్రేక్ అందుకున్నారు. `శివ`తో ఇండస్ట్రీని షేక్ చేశారు. `హలో బ్రదర్`తో కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `అన్నమయ్య`, `శ్రీరామదాసు`, `రాజన్న`, `నేటి సిద్ధార్థ`, `రక్షణ`, `వారసుడు`, `గోవిందా గోవిందా`, `క్రిమినల్`, `అజాద్`, `శివమణి`, `మన్మథుడు`, `సంతోషం`, `మాస్`, `కింగ్`, `సోగ్గాడే చిన్ని నాయన`, `బంగ్గార్రాజు`, `నా సామి రంగా` వంటి చిత్రాలతో విజయాలు అందుకుని తెలుగులో స్టార్ హీరోగా ఎదిగారు. అదే సమయంలో ఏఎన్నార్ నట వారసుడిగా రాణించారు. సినిమాల్లోనే కాదు, వ్యాపారాలను కూడా విస్తరించి వేలకోట్లకు ఎదిగారు నాగార్జున.