రామ్ చరణ్ చేతికి గాయం, షూటింగ్ లో ప్రమాదం జరిగిందా? ఆందోళనలో అభిమానులు

Published : Jun 28, 2025, 11:17 AM IST

మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ చేతికి ఏమయ్యింది. పబ్లిక్ ఈవెంట్ లో చెయ్యి పైకి ఎత్తడానికి రామ్ చరణ్ ఎందుకు ఇబ్బందిపడ్డాడు.

PREV
15

తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 26న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, యూత్ పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూత్ లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించాలనే అవగాహన కల్పించడమే ముఖ్యఉద్దేశ్యం.

25

ఈ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం చివరిలో భాగంగా, హాజరైన ప్రతినిధులందరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేశారు. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ చేయి పైకి ఎత్తినప్పుడు మోచేతికి గాయమైనట్టు కనిపించింది. ఆయన డెబ్బతిన్న చెయ్యిపై పెద్ద బ్యాండేజ్ కనిపించడంతంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

35

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. చరణ్ చేతికి బ్యాండేజ్ కనిపించడంతో అభిమానులు ఆందోళనకు లోనయ్యారు. “రామ్ చరణ్ చేతికి ఏమైంది? ఇంత పెద్ద బ్యాండేజ్ ఎందుకు వేశారు? అనే ప్రశ్నలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 

ఆయన గాయం పెద్ది సినిమా షూటింగ్ సమయంలో జరిగిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ నుంచి కాని, మూవీ టీమ్ నుంచి కాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, ఈ గాయం పెద్దది కాదని తెలుస్తోంది.

45

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పెద్ది' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దివ్యేందు శర్మ, అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించింది.

55

గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ ప్లాప్ ను చూశారు చరణ్. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా ఫలితంతో కొంత నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ‘పెద్ది’ సినిమాపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు.

 టైమ్‌కు షూటింగ్ పూర్తిచేసి, సినిమాను ప్రకటించిన తేదీకే విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనడం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. యువతలో సానుకూల మార్పు తీసుకొచ్చేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories