అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని జూన్ 6న వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. జైనబ్ తో అఖిల్ వివాహం ఘనంగా జరిగింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నాగార్జున ఇంట్లోనే అఖిల్ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. రిసెప్షన్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
25
ఇన్ని రోజుల తర్వాత పెళ్లి ఫోటోలు షేర్ చేయాలని అనిపించిందా ?
అఖిల్ వివాహం తర్వాత ఆ ఫోటోలని నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. నాగచైతన్య, శోభిత ధూళిపాల కూడా కంగ్రాట్స్ చెప్పారు. కానీ అఖిల్ మాత్రం తన పెళ్లి గురించి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. కానీ పెళ్లయిన దాదాపు 20 రోజుల తర్వాత అఖిల్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. 20 రోజుల తర్వాతే తన పెళ్లి విషయం అభిమానులకు చెప్పాలని అఖిల్ కి అనిపించిందా అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.
35
జైనబ్ తో రొమాంటిక్ గా..
పెళ్లి వేడుకలో జైనబ్ తో రొమాంటిక్ గా ఉన్న అందమైన ఫోటోలని అఖిల్ షేర్ చేశారు. నా జీవితంలో అత్యుత్తమమైన రోజుకు సంబంధించిన కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ అఖిల్ తన పెళ్లి ఫోటోలని షేర్ చేశారు. పెళ్లి బట్టల్లో అఖిల్, జైనబ్ ఇద్దరూ మెరిసిపోతూ చిరునవ్వులు చిందిస్తున్నారు.
అఖిల్ భార్య జైనబ్ బడా పారిశ్రామికవేత్త జుల్ఫీ కుమార్తె. ఆమె వేల కోట్ల ఆస్తులకు వారసురాలని ప్రచారం జరుగుతోంది. జైనబ్ తండ్రి జుల్ఫీ, నాగార్జున కుటుంబాలకు వ్యాపారంలో పరిచయాలు ఉన్నాయని సమాచారం. ఆ విధంగా అఖిల్ కి జైనబ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమకు కారణమైంది.
55
అఖిల్ లెనిన్ మూవీ
ఇక సినిమాల విషయానికొస్తే అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యన విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల ఎంపిక కాగా ఆ తర్వాత ఆమె డేట్స్ ఇష్యూ కారణంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.