యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్ సమంత. ఆయనతో సినిమాలు చేయకలేకపోయినా.. ప్రభాస్ గురించి ఆమె చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నదంటే?
టాలీవుడ్‌లో డార్లింగ్ ప్రభాస్ గురించి, సౌత్ క్వీన్ సమంత ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటారు. ఇక ప్రభాస్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ అన్నది కేవలం పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎలా ఎదురుచూస్తారో, నిర్మాతలు కూడా ఆయన డేట్స్ కోసం అలాగే ఆశగా చూస్తుంటారు. రీసెంట్‌గా ఇదే విషయంపై నటి సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
24
ప్రభాస్ చేయేస్తే 100 కోట్లు
సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సాధించింది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం జోరుగా ప్రమోషన్స్ చేసింది సమంత. ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో స్టార్ హీరోల స్టార్‌డమ్ గురించి మాట్లాడుతూ ఆమె ప్రభాస్ పేరును ప్రస్తావించారు. "ప్రభాస్ ఒక సినిమాకు సైన్ చేస్తే చాలు, ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే నిర్మాతలకు కనీసం రూ.100 కోట్ల గ్యారెంటీ ఉంటుంది. గత పదేళ్లుగా ఆయన తన కష్టంతో.. సంపాదించుకున్న స్టార్‌డమ్ అది," అని సమంత ప్రభాస్‌ను పొగిడారు. ప్రభాస్ కాల్‌షీట్ దొరకడం అంత ఈజీ కాదనే విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు.
34
హీరోయిన్ అంటే 'త్యాగమూర్తి' అనే ఫ్రేమ్‌ను బ్రేక్ చేస్తా
కేవలం హీరోల గురించే కాదు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల గురించి కూడా సమంత కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. "సాధారణంగా హీరోయిన్ సెంట్రిక్ సినిమా అంటే అందులో హీరోయిన్ ఒక దేవతలా, త్యాగమూర్తిలా ఉండాలి. అందరి మంచి కోరాలి. మనమంతా ఆడవాళ్లను ఒక ఫ్రేమ్‌లో బంధించేశాం. కానీ నేను ఆ ఇమేజ్‌ను బ్రేక్ చేయాలనుకుంటున్నా. ఆడవాళ్లు కూడా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సినిమాలు చేయగలరు, మేం కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలమని నిరూపించడానికే నేను వచ్చాను," అని సమంత సవాల్ విసిరారు.
ఈ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి కూడా సమంత ఆలోచనలకు సపోర్ట్ ఇచ్చారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఇలాంటి యాక్షన్, మాస్ సినిమాలతో చరిత్ర సృష్టించారు. ఇప్పటి ఆడియన్స్ 'చార్లీస్ ఏంజిల్స్' లాంటి స్టైలిష్, పవర్‌ఫుల్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలను ఇష్టపడుతున్నారు. 'మా ఇంటి బంగారం' కూడా అలాంటి ఒక ప్రయత్నమే అని ఆమె నమ్మకంగా చెప్పారు.జూన్ 19న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం సినిమాకు సమంత సహ నిర్మాత కూడా . ఈసినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరి ముందు ముందు ఈమూవీ ఏ రేంజ్ లో రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి.