రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ, క్రేజీ న్యూస్ లో నిజమెంత?

Published : May 28, 2025, 03:59 PM IST

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా..? ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ విషయంలో నిజం ఎంత?

PREV
15

ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ ప్రాజెక్టు ముగిసిన తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. సుకుమార్ తో ఆల్ రెడీ ఓ సినిమాను కమిట్ అయ్యాడు రామ్ చరణ్.

25

ఇక తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ సినిమా కూడా సుకుమార్ సినిమాతో పాటే వెంటనే పట్టాలెక్కనుందట. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సీనియర్ హీరో వెంకటేశ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమాతో పాటు చరణ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

35

ఇదిలా ఉండగా, త్రివిక్రమ్ – చెర్రీ కాంబినేషన్‌కు సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయనీ, రామ్ చరణ్ ఇప్పటికే ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. వీరిద్దరి కాంబోలో ఇంత వరకూ సినిమా రాలేదు. మరి ఈ విషయంలో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని. సోషల్ మీడియా మాత్రం కోడై కూస్తోంది.

45

ఈ కాంబినేషన్ ఫిక్స్ అయితే.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌కు, రామ్ చరణ్ ఎనర్జిటిక్ నటన కలసి సినిమాకు భారీ రేంజ్‌లో హైప్ రావడం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్‌పై ఇప్పుడే అంచనాలు పెట్టుకుంటున్నారు. ఒకవేళ ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ అయితే .. ఇది 2025 చివరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

55

ఇక ప్రస్తుతం పెద్ది సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు ఫ్యాన్స్. బుచ్చిబాబు సాన డైరెక్షన్ తో పాటు, సుకుమార్ కథతో తెరకెక్కుతున్న ఈసినిమా నుంచి టైటిల్ పోస్టర్ తో పాటు , ఫస్ట్ గ్లిమ్ల్స్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యి..మంచి స్పందనను సాధించాయి.

Read more Photos on
click me!

Recommended Stories